Wednesday, October 5, 2022
Homeన్యూస్బిగ్ బాస్ 5: సన్నీ, శ్రీరామ్ ల మధ్య గొడవ ఎక్కడికి వెళ్తుందో?

బిగ్ బాస్ 5: సన్నీ, శ్రీరామ్ ల మధ్య గొడవ ఎక్కడికి వెళ్తుందో?

బిగ్ బాస్ 5: సన్నీ, శ్రీరామ్ ల మధ్య గొడవ ఎక్కడికి వెళ్తుందో?
బిగ్ బాస్ 5: సన్నీ, శ్రీరామ్ ల మధ్య గొడవ ఎక్కడికి వెళ్తుందో?

బిగ్ బాస్ సీజన్ 5 లో ఈ వారం ఆసక్తికరంగా సాగుతోంది. నామినేషన్స్ తో పాటు అంతా కూడా సరికొత్తగా డిజైన్ చేసాడు బిగ్ బాస్. ప్రస్తుతం కెప్టెన్సీ టాస్క్ నడుస్తోంది. మొత్తం 12 మంది ఇంటి సభ్యుల్లోనుండి ఆరుగురు ఈ వారం ఫైనల్ కెప్టెన్సీ రేసుకి ఎంపికయ్యారు. షణ్ముఖ్, సిరి, శ్రీరామ్ చంద్ర, ఎన్నీ మాస్టర్, సన్నీ, మానస్ లు కెప్టెన్సీ రేసులో నిలిచారు.

- Advertisement -

ఈరోజు ఫైనల్ టాస్క్ ను టెలికాస్ట్ చేయనున్నారు. దానికి సంబంధించిన ప్రోమోను మాత్రం స్టార్ మా ముందుగానే విడుదల చేసారు.  ఈ టాస్క్ లో భాగంగా ఆరుగురు పోటీదారులకు ఒక బ్యాగ్ లో థెర్మోకోల్ బాల్స్ ను నింపి దాన్ని కాపాడుకోవాలని, ఎవరి వద్ద ఫైనల్ గా ఎక్కువ బాల్స్ ఉంటాయో వారు నెగ్గినట్లు అని బిగ్ బాస్ తెలిపారు.

అయితే ఈ టాస్క్ లో సన్నీ, శ్రీరామ్ ల మధ్య గొడవ జరిగింది. సన్నీ, మానస్ కోసం తన బ్యాగ్ ను త్యాగం చేసాడని శ్రీరామ్ ఆరోపించాడు. నువ్వు ఇండివిడ్యుయల్ ప్లేయర్ అనుకున్నాను కానీ కాదు అంటూ శ్రీరామ్ తెలివిగా సన్నీను ప్రవోక్ చేసాడు. నా కెప్టెన్సీ ఆట ఏంటో చూపిస్తా అంటూ సన్నీ అనడంతో ఈరోజు ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగనుందని అనిపిస్తోంది. చివరికి కెప్టెన్సీ టాస్క్ ఎవరు గెలుస్తారో చూడాలి.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts