Homeటాప్ స్టోరీస్నాని పై విమర్శలు చేసిన బిగ్ బాస్ 2 సంజన

నాని పై విమర్శలు చేసిన బిగ్ బాస్ 2 సంజన

bigg boss 2 contestant sanjana sensational comments on hero nani నాని యాంకరింగ్ అంతగా బాగోలేదని , నాకు అస్సలు నచ్చలేదని సంచలన వ్యాఖ్యలు చేసింది బిగ్ బాస్ 2 లో పోటీదారుగా పాల్గొన్న మోడల్ సంజన . బిగ్ బాస్ 2 లో పాల్గొన్న ఈ భామ ని మొదటి వారంలోనే ఎలిమినేట్ చేసారు దాంతో బిగ్ బాస్ నిర్వాహకులతో పాటుగా నాని ని కూడా విమర్శిస్తోంది సంజన . నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న తీరు నాకు అస్సలు నచ్చలేదు దానికి కారణం ఎన్టీఆర్ కావచ్చు అంటూ వ్యాఖ్యానించింది .

అంతేకాదు బిగ్ బాస్ నిర్వాహకులు నాకు నయా పైసా కూడా ఇవ్వలేదని , అసలు ఆ షోకు వెళ్లినందుకు బాధపడుతున్నానని ఇకపై ఇలాంటి షోలకు వెళ్ళేది లేదని అంటోంది సంజన . బిగ్ బాస్ 1 కి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించాడు అలాగే ఎన్టీఆర్ యాంకరింగ్ తో ఆ షో సూపర్ హిట్ అయ్యింది అయితే నాని ఎన్టీఆర్ కంటే చిన్న హీరో కావడం చేత కావచ్చు పెద్దగా స్పందన రావడం లేదు . ముందు ముందు నాని అలరిస్తాడేమో చూడాలి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All