Homeటాప్ స్టోరీస్నాని కొత్త సినిమా పేరు ఇదే

నాని కొత్త సినిమా పేరు ఇదే

nani gets new titleబిగ్ బాస్ 2 సీజన్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాని తాజాగా కొత్త సినిమా టైటిల్ ని అనౌన్స్ చేసాడు . ఇంతకీ ఆ టైటిల్ ఏంటో తెలుసా ……” జెర్సీ ”. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి గౌతమ్ దర్శకత్వం వహిస్తుండగా పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు . ఈరోజు జెర్సీ టైటిల్ తో పాటు ఏ నేపథ్యంలో సినిమా రూపొందుతుందో తెలియజేసాడు నాని .

వరుస విజయాలు సాధిస్తున్న నాని కి కృష్ణార్జున యుద్ధం స్పీడ్ బ్రేక్ వేసింది . దాంతో ముందు వెనకా ఆలోచింది జాగ్రత్తలు తీసుకొని ఈ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు . ప్రస్తుతం నాగార్జున తో మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్న నాని మరోవైపు బిగ్ బాస్ 2 కి హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నాడు . ప్రస్తుతమైతే బిగ్ బాస్ 2 ఫరవాలేదు అనే రేంజ్ లోనే ఉంది , ముందు ముందు ప్రేక్షకులను అలరిస్తుందా ? లేక చతికిల బడుతుందా తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All