
పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ మూవీ ఫిబ్రవరి 25 న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. అయితే మన దగ్గర భీమ్లా నాయక్ టాక్ ఓ రోజు ముందే తెలిసిపోతుంది. ఈ విషయాన్నీ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తెలిపారు. గత కొద్దీ నెలలుగా యావత్ సినీ లోకం , అభిమానులు ఎదురుచూస్తున్న బీమ్లా నాయక్ ..ఫిబ్రవరి 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పవన్ కళ్యాణ్ – రానా కలయికలో తెరకెక్కిన భీమ్లా నాయక్ చిత్రానికి సాగర్ కే చంద్ర డైరెక్ట్ చేయగా.. సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ అందించడం విశేషం. థమన్ మ్యూజిక్ అందించగా.. నిత్య మీనన్, సంయుక్త మీనన్లు హీరోయిన్లు గా నటించారు. వకీల్ సాబ్ తర్వాత పవన్ నటించిన సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. దీంతో ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున సినిమాను రిలీజ్ చేస్తున్నారు నిర్మాత నాగ వంశీ.
ఈ క్రమంలో ఈ సినిమా రిలీజ్ విశేషాలను తమన్ ట్విట్టర్ ద్వారా చెప్పుకొచ్చారు. ఓవర్సీస్ లో ఈ మూవీ 400 థియేటర్స్ లలో రిలీజ్ కాబోతున్నట్లు పోస్టర్ ద్వారా తెలిపారు థమన్. ఫిబ్రవరి 24న యూఎస్ ప్రీమియర్స్ పడతాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దీనిని బట్టి చూస్తే భీమ్లా నాయక్ ఎలా ఉందనేది ఓ రోజు ముందే మనకు తెలిసిపోతుందన్నమాట.
FULL FEAST !! ????????? #BheemlaNayakOnFeb25 #BheemlaNayakUSA ?? pic.twitter.com/gNxPKMVIxB
— thaman S (@MusicThaman) February 17, 2022