Homeన్యూస్భీమ్లా నాయక్ ట్రైలర్ ఓ రేంజ్ లో కట్ చేశారట

భీమ్లా నాయక్ ట్రైలర్ ఓ రేంజ్ లో కట్ చేశారట

భీమ్లా నాయక్ ట్రైలర్ ఓ రేంజ్ లో కట్ చేశారట
భీమ్లా నాయక్ ట్రైలర్ ఓ రేంజ్ లో కట్ చేశారట

పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం భీమ్లా నాయక్. ఈ మూవీ లో రానా విలన్ రోల్ లో నటిస్తుండగా ..పవన్ కు జోడిగా నిత్యా మీనన్ , రానా కు జోడి గా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. సాగర్ కే డైరెక్ట్ చేస్తుండగా…త్రివిక్రమ్ మాటలు , స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ కార్య క్రమాలు పూర్తి చేసుకొని యూ / ఏ సర్టిఫికెట్ పొందిన ఈ మూవీ ఈ నెల 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ఈరోజు సోమవారం చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు. ఈ మెగా ఈవెంట్ కు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ తో పాటు , మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లు ముఖ్య అతిధులుగా రాబోతున్నారు.

గత కొద్దీ రోజులుగా ఎదురుచూస్తున్న అసలు సిసలైన ట్రైలర్ ను ఈ మెగా ఈవెంట్ లో విడుదల చేయబోతున్నారు. అయితే ఈ ట్రైలర్ ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి మరింతగా పెరిగింది. కాగా ఈ ట్రైలర్ తాలూకా విశేషాలు బయటకొచ్చాయి.

- Advertisement -

ఈ ట్రైలర్ నిడివి 2 నిమిషాల 14 సెకెన్ల గా కట్ చేశారట. ఇందులో పవన్ విశ్వరూపాన్ని చూపించారని అంటున్నారు. అలాగే, రానా పాత్రకూ బాగానే ప్రాధాన్యం ఇచ్చారట. చివర్లో మాత్రం షాకింగ్‌గానే! ‘భీమ్లా నాయక్’ ట్రైలర్‌లో పవన్ కల్యాణ్ ఎలివేషన్ సీన్స్ హైలైట్ కాబోతున్నాయట. అలాగే, థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ మరింత బలాన్ని ఇచ్చే విధంగా ఉంటుందని అంటున్నారు. మరి ఈ ట్రైలర్ యూట్యూబ్ లో ఏ రేంజ్ రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All