Homeన్యూస్భీమ్లా నాయక్ బెనిఫిట్ షోస్ డీటెయిల్స్

భీమ్లా నాయక్ బెనిఫిట్ షోస్ డీటెయిల్స్

భీమ్లా నాయక్ బెనిఫిట్ షోస్ డీటెయిల్స్
భీమ్లా నాయక్ బెనిఫిట్ షోస్ డీటెయిల్స్

పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం భీమ్లా నాయక్. ఈ మూవీ లో రానా విలన్ రోల్ లో నటిస్తుండగా ..పవన్ కు జోడిగా నిత్యా మీనన్ , రానా కు జోడి గా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. సాగర్ కే డైరెక్ట్ చేస్తుండగా…త్రివిక్రమ్ మాటలు , స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ కార్య క్రమాలు పూర్తి చేసుకొని యూ / ఏ సర్టిఫికెట్ పొందిన ఈ మూవీ ఈ నెల 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ క్రమంలో సినిమా తాలూకా విశేషాలు బయటకొస్తూ అంచనాలు పెంచేస్తున్నాయి.  ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రేపు హైదరాబాద్ లో గ్రాండ్ గా జరపబోతున్నారు. ఈ ఈవెంట్ కు కేటీఆర్ , మంత్రి తలసాని హాజరుకాబోతున్నట్లు ఇప్పటీకే మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు.

- Advertisement -

ఇక బెనిఫిట్ షోస్ ఎక్కడెక్కడ పడబోతున్నాయి…వాటి టికెట్ ధరలు ఎలా ఉండబోతాయి అనే దాని గురించి  అభిమానులు మాట్లాడుకుంటున్నారు. దీనిపై నిర్మాత నాగ వంశీ ఇప్పటికే పలు మాస్ థియేటర్స్ యాజమాన్యాలతో మాట్లాడినట్లు తెలుస్తుంది.

మూసాపేట్ , కూకట్ పల్లి , బోరబండ పలు ఏరియాలోని థియేటర్స్ లలో బెనిఫిట్ షోస్ వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ బెనిఫిట్ షోస్ టికెట్ ధర రూ. 700 నుండి 1000 ల వరకు ఉండొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా మొదటిరోజు బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All