Homeన్యూస్షూటింగ్ పూర్తి చేసుకున్న భీమ్లా నాయక్...

షూటింగ్ పూర్తి చేసుకున్న భీమ్లా నాయక్…

షూటింగ్ పూర్తి చేసుకున్న భీమ్లా నాయక్...
షూటింగ్ పూర్తి చేసుకున్న భీమ్లా నాయక్…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భీమ్లా నాయక్ షూటింగ్ పూర్తయినట్లు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసారు.  పవన్ కల్యాణ్ – దగ్గుబాటి రానా కలయికలో తెరకెక్కిన భారీ మల్టీస్టారర్ చిత్రం ‘భీమ్లా నాయక్’. సాగర్ కే చంద్ర డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ అందించడం విశేషం. థమన్ మ్యూజిక్ అందించగా.. నిత్య మీనన్, సంయుక్త మీనన్లు హీరోయిన్లు గా నటించారు.

ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఫిబ్రవరి 25 న రిలీజ్ కాబోతుంది. సినిమాలోని ఓ సాంగ్ షూటింగ్ తో పాటు కొన్ని సన్నివేశాలు మిగిలి ఉండగా వాటిని రామోజీ ఫిలిం సిటీ లో షూట్ చేస్తూ వచ్చారు. ఈరోజుతో షూటింగ్ అంత పూర్తి అయ్యినట్లు చిత్ర యూనిట్ ట్విట్టర్ లో తెలిపారు. పవన్ కళ్యాణ్, దర్శకుడు సాగర్ కెచంద్ర, డీవోపీ రవికె చంద్రన్ దిగిన ఫోటోను షేర్ చేస్తూ షూటింగ్ కంప్లీట్ అయినట్టు చెప్పుకొచ్చారు.

- Advertisement -

ఇక ఈ సినిమాలో  సముద్ర ఖని, మురళీ శర్మ, బ్రహ్మాజీ, బ్రహ్మానందం ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇదివరకు విడుదలైన ఈ సినిమా టీజర్, సింగిల్స్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నెల 21 న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆరోజే ట్రైలర్ కూడా విడుదల చేస్తారు కావొచ్చు. గత ఏడాది వకీల్ సాబ్ తో బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసిన పవర్ స్టార్ .. ఈ ఏడాది భీమ్లానాయక్ తో ఇంకే స్థాయిలో రికార్డులు బద్దలు కొడతారో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All