Homeన్యూస్భీమ్లా నాయక్ ఓటిటి రైట్స్ దక్కించుకున్న ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’

భీమ్లా నాయక్ ఓటిటి రైట్స్ దక్కించుకున్న ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’

భీమ్లా నాయక్ ఓటిటి రైట్స్ దక్కించుకున్న ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’
భీమ్లా నాయక్ ఓటిటి రైట్స్ దక్కించుకున్న ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’

పవన్ కళ్యాణ్ – రానా కలయికలో తెరకెక్కిన భీమ్లా నాయక్ ఓటిటి రైట్స్ ను ప్రముఖ ఓటిటి సంస్థ ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’ దక్కించుకున్నట్లు సమాచారం. సాగర్ కే చంద్ర డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ అందించడం విశేషం. థమన్ మ్యూజిక్ అందించగా.. నిత్య మీనన్, సంయుక్త మీనన్లు హీరోయిన్లు గా నటించారు.

మొన్నటి వరకు ఈ మూవీ రిలీజ్ డేట్ ఫై అనేక అనుమానాలు నెలకొని ఉండేవి. కానీ ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ సినిమాను ఫిబ్రవరి 25 న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు నిర్మాత నాగ వంశీ ప్రకటించారు. ఈ ప్రకటన తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

- Advertisement -

ఇదిలా ఉంటె ఈ చిత్రం తాలుకా ఓటిటి హక్కులను ప్రముఖ ఓటిటి సంస్థ ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’ వారు ఫ్యాన్సీ ప్రైస్ ఇచ్చి కొనుగోలు చేశారట. దీనితో ఈ సినిమా స్ట్రీమింగ్ పార్ట్నర్ కన్ఫర్మ్ అయ్యినట్టు తెలుస్తుంది. ఇక విడుదలకు సమయం తక్కువగా ఉండడం తో మేకర్స్ ప్రమోషన్ ఫై దృష్టి సారించారు. ఈ నెల 21 న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని యూసఫ్ గూడా లో చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనిపై మరో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన రానుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All