
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పవర్ ఏంటో చూపించడానికి సిద్దమయ్యాడు. గత కొద్దీ నెలలుగా యావత్ సినీ లోకం , అభిమానులు ఎదురుచూస్తున్న బీమ్లా నాయక్ ..మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పవన్ కళ్యాణ్ – రానా కలయికలో తెరకెక్కిన భీమ్లా నాయక్ చిత్రానికి సాగర్ కే చంద్ర డైరెక్ట్ చేయగా.. సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ అందించడం విశేషం. థమన్ మ్యూజిక్ అందించగా.. నిత్య మీనన్, సంయుక్త మీనన్లు హీరోయిన్లు గా నటించారు.
ఈ మూవీ ఫై భారీ అంచనాలు నెలకొని ఉండడం తో భారీ స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు నిర్మాత నాగవంశీ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలతోపాటు ఉత్తరాదిలో ఈ సినిమాను రికార్డు స్థాయి థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. తెలుగు భాషతోపాటు హిందీ భాషలో కూడా డబ్బింగ్ చేసి ఏక కాలంలో విడుదల చేసేందుకు వంశీ ప్లాన్ చేసాడట.
ప్రపంచవ్యాప్తంగా సుమారు 4 వేల స్క్రీన్లలో రిలీజ్ చేయబోతున్నారని , పవన్ కల్యాణ్ సినిమా ఈ రేంజ్‌లో విడుదల కావడం ఇదే మొదటిసారి అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అలాగే ఈ చిత్ర ఆడియో రైట్స్ 5 కోట్లకు పైగా, శాటిలైట్ హక్కులు 45 కోట్లకుపైగా అమ్మడం జరిగిందని చెపుతున్నారు. ఓవరాల్‌గా భీమ్లా నాయక్ 190 నుంచి 200 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్టు వినికిడి.