HomeVideosబంగార్రాజు టీజర్: చిన్న బంగార్రాజు వచ్చాడు!!

బంగార్రాజు టీజర్: చిన్న బంగార్రాజు వచ్చాడు!!

బంగార్రాజు టీజర్: చిన్న బంగార్రాజు వచ్చాడు!!
బంగార్రాజు టీజర్: చిన్న బంగార్రాజు వచ్చాడు!!

అక్కినేని నాగార్జున కెరీర్ లో సోగ్గాడే చిన్ని నాయన అనేది చాలా స్పెషల్ చిత్రం. డీసెంట్ అంచనాలతో విడుదలైన ఆ చిత్రం నాగ్ కెరీర్ లోనే భారీ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. సంక్రాంతికి హేమాహేమీలతో తలపడి ఆ విజయం సాధించింది. ఇప్పుడు ఆ బ్లాక్ బస్టర్ కు సీక్వెల్ తెరకెక్కుతోన్న విషయం తెల్సిందే. సోగ్గాడే.. లో నాగ్ పోషించిన బంగార్రాజు పాత్రనే టైటిల్ గా తీసుకుని చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సీక్వెల్ లో నాగ చైతన్య కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుండడం విశేషం. నాగ చైతన్య సరసన ఉప్పెన భామ కృతి శెట్టి నటిస్తోంది.

రీసెంట్ గా ఈ చిత్రం నుండి కృతి శెట్టి ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన బంగార్రాజు టీమ్ ఈరోజు నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా టీజర్ ను విడుదల చేసారు. ఈ టీజర్ లో చిన్న బంగార్రాజుగా కనిపించాడు. బంగార్రాజు వేసుకునే ఆభరణాలు వేసుకుని, తను వాడే కర్రను తీసుకుని, బంగార్రాజు బైక్ పై నాగ చైతన్య స్టైలిష్ గా కూర్చోవడాన్ని చూపించారు. అక్కినేని అభిమానులకు ఈ చిత్రం కనుల విందుగా ఉంటుందని అర్ధమవుతోంది.

- Advertisement -

బంగార్రాజులో నాగార్జున సరసన రమ్య కృష్ణ నటిస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తోన్న ఈ సినిమాను కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All