Homeటాప్ స్టోరీస్బండ్ల గణేష్ కు దూల తీరింది

బండ్ల గణేష్ కు దూల తీరింది

Bandla ganesh shocked with congress high commandటాలీవుడ్ నటుడు , నిర్మాత బండ్ల గణేష్ కు దూల తీరింది . ఎం ఎల్ ఏ కావాలని ఆశపడి కాంగ్రెస్ పార్టీలో చేరాడు . పార్టీలో చేరడానికి తెరవెనుక పెద్ద ప్రయత్నాలే చేసాడు అన్నీ కలిసొచ్చాయి దాంతో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్దం పుచ్చుకున్నాడు . కట్ చేస్తే రెట్టించిన ఉత్సాహంతో పార్టీ టికెట్ కేటాయించబోతోంది , గెలిచి అసెంబ్లీ లో అడుగుపెడతాను అంటూ మీడియా ముందుకు వచ్చి గొప్పగా చెప్పుకున్నాడు కూడా . కట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ బండ్ల గణేష్ కు షాక్ ఇచ్చింది దాంతో దూల తీరిందా ….. బాబు దూల తీరిందా అంటూ బండ్ల గణేష్ ని వ్యతిరేకించే వాళ్ళు పండగ చేసుకుంటున్నారు .

కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో షాద్ నగర్ సీటు ఆశించాడట ! అప్పుడు హామీ లభించింది కానీ షాద్ నగర్ టికెట్ మాత్రం దక్కలేదు దాంతో కనీసం రాజేంద్ర నగర్ టికెట్ అయినా దక్కుతుంది అని అనుకున్నాడు అది కూడా బెడిసి కొట్టింది దాంతో బండ్ల గణేష్ కు చుక్కలు కనిపించాయి . కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఎలా ఉంటుందో ఇప్పుడు బండ్ల గణేష్ కు తెలిసి వచ్చింది దాంతో షాక్ అవుతున్నాడు బండ్ల . అయితే బండ్ల గణేష్ నిరాశలో ఉన్నాడని గ్రహించిన అధిష్టానం అతడ్ని పార్టీ అధికార ప్రతినిధిగా నియమించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది .

- Advertisement -

English Title: Bandla ganesh shocked with congress high command

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All