Homeటాప్ స్టోరీస్దేశ భవిష్యత్ కోసం రాహుల్ ని కలిసా : చంద్రబాబు

దేశ భవిష్యత్ కోసం రాహుల్ ని కలిసా : చంద్రబాబు

Chandrababu , Rahul Gandhi join hands to defeat BJPభారతీయ జనతా పార్టీ వ్యవస్థలను అన్నింటినీ నాశనం చేసిందని అందుకే భారత దేశ భవిష్యత్ కోసం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ని కలిసానని స్పష్టం చేసారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు . నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ని కలవడం సంచలనం సృష్టిస్తోంది . భారత రాజకీయాల్లో ఇది సరికొత్త విప్లవానికి నాంది అవుతుందని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు . ఆంధ్రపదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిన నరేంద్ర మోడి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక మాత్రం మొండి చేయి చూపించాడు . దాంతో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్ డి ఎ నుండి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చింది .

ఇక అప్పటినుండి తెలుగుదేశం – భారతీయ జనతా పార్టీ ల మద్య ఉప్పు నిప్పు లా తయారయ్యింది పరిస్థితి . పెద్ద నోట్లు రద్దు , జీ ఎస్ టి లతో ప్రజలంతా కష్టాలు పడుతుండటంతో కేంద్రంలోని మోడి ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న లక్ష్యంతో బద్ద వ్యతిరేక పార్టీ అయిన కాంగ్రెస్ తో కలిసి పోరాడాలని నిర్ణయించుకున్నాడు చంద్రబాబు నాయుడు . అందులో భాగంగా ఈరోజు రాహుల్ గాంధీ ని కలిసాడు . పలు అంశాలపై చర్చించిన తర్వాత మీడియా ముందుకు వచ్చారు బాబు – రాహుల్ . త్వరలోనే మిగతా పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేయాలనీ భావిస్తున్నాడు చంద్రబాబు నాయుడు .

- Advertisement -

English Title: Chandrababu , Rahul Gandhi join hands to defeat BJP

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All