Homeటాప్ స్టోరీస్బండ్ల గణేష్ కు టికెట్ ఇస్తారా ?

బండ్ల గణేష్ కు టికెట్ ఇస్తారా ?

Bandla ganesh eyes on rajendranagar నటుడు , నిర్మాత బండ్ల గణేష్ అసెంబ్లీ లోకి అడుగు పెట్టి అధ్యక్షా ! అని ప్రజా సమస్యలపై గళం ఎత్తాలని ఉవ్విళ్ళూరుతున్నాడు అందుకే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నాడు . షాద్ నగర్ నుండి పోటీ చేయాలనీ అనుకున్నాడు కానీ కుదరలేదు దాంతో ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ పై దృష్టి పెట్టాడు . గ్రేటర్ హైదరాబాద్ లో ఎక్కువగా సెటిలర్ ఓట్లు ఉంటాయి దాంతో అవి గంపగుత్తగా కాంగ్రెస్ – టిడిపి అభ్యర్ధికి పడతాయి కాబట్టి గ్రేటర్ పరిధిలో పోటీ చేయడం శ్రేయస్కరం అని భావించాడట . అందుకే కాంగ్రెస్ పార్టీ పెద్దల చుట్టూ నెలరోజులుగా తిరుగుతూనే ఉన్నాడు లాబియింగ్ చేస్తూనే ఉన్నాడు .

అయితే ఇప్పటికైతే కాంగ్రెస్ పెద్దలు బండ్ల గణేష్ ని కనికరించలేదు . అయితే సీటు తప్పకుండా వస్తుందని ఆశాభావంతో ఉన్నాడు బండ్ల . ఇదే రాజేంద్ర నగర్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేయాలనీ ప్రచారం కూడా మొదలు పెట్టాడు కార్తీక్ రెడ్డి . మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడే ఈ కార్తీక్ రెడ్డి . పైగా యువ నాయకుడు కాబట్టి టికెట్ నాదే అంటూ ధీమాగా ఉన్నాడు . అయితే మద్యలో బండ్ల గణేష్ దూరాడు కాబట్టి టికెట్ చివరి నిమిషంలో ఎలాంటి మలుపులైనా తిరగొచ్చు . కాంగ్రెస్ పెద్దలు బండ్ల కు చాన్స్ ఇస్తారా ? లేక కార్తీక్ రెడ్డి కి ఇస్తారా ? రేపు తేలిపోనుంది అసలు విషయం .

- Advertisement -

English Title: Bandla ganesh eyes on rajendranagar

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All