Homeటాప్ స్టోరీస్బ్రతకనేర్చినోడు బండ్ల గణేష్

బ్రతకనేర్చినోడు బండ్ల గణేష్

bandla ganesh eyes on politicsహాస్య నటుడిగా సినిమారంగంలో అడుగుపెట్టాడు కట్ చేస్తే ….. పౌల్ట్రీ బిజినెస్ తో కొంతమంది అండదండలతో బిజినెస్ మెన్ అయ్యాడు , ఆ తర్వాత తనకున్న తెలివితేటలతో నిర్మాత కూడా అయ్యాడు ….. పవన్ కళ్యాణ్ కు భక్తుడు అలా అని ఇతర హీరోలకు చెడ్డవాడు మాత్రం కాదు వాళ్ళని కూడా పొగుడుతాడు బుట్టలో పడేస్తాడు మొత్తానికి తనకు కావాల్సిన పని చేయించుకుంటాడు . హీరోల విషయంలోనే కాదు రాజకీయ నాయకుల విషయంలో కూడా ఇతగాడికి పార్టీల మధ్య వైరుధ్యాలు అడ్డు రావు బొత్స సత్యనారాణయ తో స్నేహం లగడపాటి రాజగోపాల్ , సీఎం రమేష్ , వెంకయ్య నాయుడు , ఇలా ఒక్కరేంటి అన్ని పార్టీల వాళ్ళు కూడా బండ్ల గణేష్ కు స్నేహితులే !

ఏ హీరో అయినా , ఏ రాజకీయ నాయకుడైనా బండ్ల గణేష్ మాయలో పడిపోవలసిందే అంతగా కలిసిపోతాడు . సినిమాల్లో హాస్య నటుడిగా ప్రస్థానం కొనసాగించిన బండ్ల నిర్మాత అయ్యాడు కట్ చేస్తే ఇప్పుడు రాజకీయ నాయకుడు కావాలని ఆశపడుతున్నాడు . పార్టీ ఏది అని ఫిక్స్ కాలేదు కానీ ఏదో ఒక పార్టీ నుండి అది కూడా తెలంగాణ లేదా ఆంధప్రదేశ్ నుండి పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు ఈ బిజినెస్ మెన్ .

- Advertisement -

అవసరమైతే టీఆర్ ఎస్ నుండి కూడా పోటీ చేయాలనీ చూస్తున్నాడట ! అందరి రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నాడు బండ్ల గణేష్ .

English Title: bandla ganesh eyes on politics

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All