Homeన్యూస్స్కూప్ షాట్లతో ఆసీస్ ను ఫైనల్ చేర్చిన వేడ్

స్కూప్ షాట్లతో ఆసీస్ ను ఫైనల్ చేర్చిన వేడ్

స్కూప్ షాట్లతో ఆసీస్ ను ఫైనల్ చేర్చిన వేడ్
స్కూప్ షాట్లతో ఆసీస్ ను ఫైనల్ చేర్చిన వేడ్

నిన్న పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా ముగిసింది. అప్పటిదాకా పాకిస్తాన్ చేతుల్లో ఉందన్న మ్యాచ్ ఒక్కసారిగా క్యాచ్ డ్రాప్ తో ఆస్ట్రేలియా చేతుల్లోకి వచ్చింది. మాథ్యూ వేడ్ వరసగా మూడు సిక్సర్లు బాదడంతో ఆస్ట్రేలియా మరో వికెట్ ఉండగానే ఐదు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో ఆదివారం జరగబోయే ఫైనల్స్ లో న్యూజిలాండ్ తో తలపడనుంది ఆస్ట్రేలియా.

ఈ మ్యాచ్ దుబాయ్ లో జరిగింది. దుబాయ్ లో మ్యాచ్ లకు టాస్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోన్న విషయం తెల్సిందే. ఇక్కడ గత 15 సందర్భాల్లో ఛేజింగ్ చేసిన జట్టు విజయం సాధించింది. దీంతో టాస్ గెలిచిన ఆసిస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ టోర్నమెంట్ లో టాప్ టీమ్స్ పై తొలిసారి తొలి బ్యాటింగ్ చేస్తోన్న పాకిస్తాన్ పెద్దగా తడబడలేదు. ఓపెనింగ్ వికెట్ కు బాబర్ అజామ్, రిజ్వాన్ ల జోడి 10 ఓవర్లలో 71 పరుగులు జోడించారు. తర్వాత వచ్చిన ఫకర్ జమాన్ కూడా బ్యాట్ ఝళిపించడంతో పాకిస్తాన్ 20 ఓవర్లు ముగిసేసరికి 176 పరుగులు చేసింది.

- Advertisement -

ఇది మంచి స్కోర్ అవ్వడం ఆస్ట్రేలియా బ్యాటింగ్ లో తొలి ఓవర్లోనే కెప్టెన్ అరోన్ ఫించ్ ను కోల్పోవడంతో పాక్ ఫెవరెట్స్ గా మారింది. వార్నర్, మిచెల్ మార్ష్ ల జోడి ఇన్నింగ్స్ ను కుదుటపరిచే ప్రయత్నం చేసారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా రెండు ఓవర్లలో 22 పరుగులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు మాథ్యూ వేడ్ ఇచ్చిన క్యాచ్ ను హసన్ అలీ జారవిడవడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. వెంటనే వేడ్ రెండు స్కూప్ లతో సహా మూడు సిక్సర్లు బాదడంతో ఒక ఓవర్ మిగిలి ఉండగానే ఆసిస్ విజయం సాధించింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All