Homeన్యూస్సెకండ్ వీకెండ్ లో డల్ అయిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్

సెకండ్ వీకెండ్ లో డల్ అయిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్

సెకండ్ వీకెండ్ లో డల్ అయిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్
సెకండ్ వీకెండ్ లో డల్ అయిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్

అఖిల్ అక్కినేని తన నాలుగో చిత్రంతో మొదటి హిట్ ను అందుకున్నాడు. దసరా పండగకు విడుదలైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ తొలి వారంలో అంచనాలకు తగ్గట్లుగా పెర్ఫర్మ్ చేసింది. విడుదలైన అన్ని ప్రాంతాల్లో ప్రామిసింగ్ కలెక్షన్స్ తో హిట్ స్టేటస్ ను సాధించింది. యూఎస్ లో సైతం ఈ చిత్రం హాఫ్ మిలియన్ డాలర్ మార్క్ ను చేరుకుంది.

అయితే తొలి వారం పూర్తయ్యాక, సెకండ్ వీకెండ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ డల్ అయింది. తన కలెక్షన్స్ కు ఎక్కువ మొత్తం యాడ్ చేయలేకపోయింది. నిన్న జరిగిన ఇండియా, పాకిస్తాన్ టి20 మ్యాచ్ కూడా ఎఫెక్ట్ చూపించింది. ఏదేమైనా కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ హిట్ స్టేటస్ ను సాధించినట్లే.

- Advertisement -

బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఆమె పోషించిన విభ పాత్ర సినిమాకు కీలకంగా పనిచేసింది. గోపి సుందర్ అందించిన సంగీతం చిత్రానికి ప్రధాన ప్లస్ పాయింట్ గా మారింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, వాసు వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఫుల్ రన్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ ఎంత వసూలు చేస్తాడు అన్నది చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All