HomeVideosఆస్ట్రేలియా అగ్గి అక్కడితో ఆరుతుందా.? ఆగుతుందా.?

ఆస్ట్రేలియా అగ్గి అక్కడితో ఆరుతుందా.? ఆగుతుందా.?

YouTube video

నిన్నమొన్నటిదాకా, పచ్చగా ఉన్న ఆస్ట్రేలియా ఇప్పుడు గతంలో ఎన్నడూ జరగని ఘోర ప్రమాదానికి గురైంది. అక్కడ దావాగ్ని అడవుల్ని దహించి వేస్తోంది. భారీ వృక్షాలు సైతం కాలి బూడిదవుతున్నాయి. అనేక ప్రాణులు తమ ఆవాసాల్ని, ప్రాణాల్ని కోల్పోతున్నాయి.

వందలాది మనుషులతో పాటు, ముఖ్యంగా ఆ మంటల కారణంగా కోట్ల జంతువులు, పక్షులు ముఖ్యంగా ఆస్ట్రేలియా కి ప్రత్యేకంగా గుర్తొచ్చే కంగారూలు, కోలా బేర్ లు, ఎన్నో రకాల అరుదైన జీవరాశులు ప్రాణాలు కోల్పోయాయి. అక్కడ మంటల దాటికి ఆకాశం ఎర్రగా మారింది. ఊళ్లకు ఊళ్లు పొగలో చిక్కుకుపోయాయి.

- Advertisement -

అసలు ఈ ప్రమాదానికి కారణం ఎవరు.?

అస్త్రేలియా ఈ ప్రమాదం నుండి ఎప్పటికి కోలుకుంటుంది.?

అసలు ఇంత జరుగుతుంటే ఇతర ప్రపంచదేశాలు ఏం చేస్తున్నాయి.?

ఇలాంటి ఘోరమైన ప్రమాదాలు త్వరలో ఇతర దేశాలలో కూడా జరగబోతున్నయా.?

అసలు ఇలాంటి విపత్తులు రాకుండా ఉండాలంటే మానవ జాతి ఏం చెయ్యాలి.? అనేది ఇప్పుడు అందరూ ఆలోచించవలసిన ఆవశ్యకత ఉంది.

జియోగ్రాఫికల్ గా ఆస్ట్రేలియా దక్షిణార్థ గోళంలో ఉండటం వల్ల ప్రస్తుతం అక్కడ వేసవి కాలం నడుస్తోంది. దీంతో రికార్డ్ స్థాయిలో టెంపరేచర్లు నమోదవుతున్నాయి. ఫారెస్ట్ ఏరియాల్లో తరచూ పిడుగులు పడుతుండటం, చేలల్లో జనం చెత్తకు నిప్పు పెడుతుండటం, గంటకు 80 మీటర్ల వేగంతో గాలులు వీస్తుండటం వంటివి ఈమంటలు ఇంతలా రావడానికి కారణాలు.

వరుసగా మూడేళ్లు వర్షాలు కురవకపోవటంతో ఎక్కడ చూసినా పొడి వాతావరణమే నెలకొంది. అంతే కాకుండా ఇక్కడ అడవులలో ఉండే చెట్లు వేడికి గురై, ఎండిపోయి, గాలికి ఆకులు రాసుకుని వచ్చే చిన్న నిప్పు, సకాలంలో స్పందించి ఆర్పకపోతే ఇలా ఘోర వినాశనానికి కారణం అవుతుంది.

ఇక్కడ మనుషులకు ఉన్న అత్యాశ కూడా ఇలా ఘోర వినాశానికి కారణం. . బొగ్గు ఎగుమతిలో ప్రపంచంలోనే పెద్ద దేశం ఆస్ట్రేలియా. అక్కడి క్లైమేట్ ఛేంజ్కు మైనింగ్ ఇండస్ట్రీ ఒక కారణం. ప్రధాన పార్టీల నేతలకు ఇండస్ట్రియలిస్టుల సపోర్ట్ ఎక్కువ. బొగ్గు ఉత్పత్తి, గ్రీన్ హౌస్ వాయువులు, కార్చిచ్చులు… ఒకదానికొకటి సంబంధం ఉన్న అంశాలు.

ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ గత కొంతకాలంగా భూగర్భంలో ఉన్న ఫాజిల్ ఫ్యూయల్ ని పర్యవరణ పరిమితులకు మించి తోడి, శుద్ధి చేసి ఎగుమతి చెయ్యడం కూడా ఇప్పుడు ఆస్ట్రేలియా ఎదుర్కొంటున్న పరిస్థితులకు ప్రధాన కారణం.

ఇప్పుడు ఆస్ట్రేలియా లో వ్యవసాయం, త్రాగు నీరు లభించక, పొగ మంటల వల్ల కాలుష్యం పెరిగిపోయి, టూరిజం దెబ్బతిని, ప్రజలకు అనారోగ్యాలు కూడా వస్తున్నాయి. ఇక జరిగిన నష్టంతో పాటు ప్రజల ఇంబ్బందులు కూడా పరిష్కరించలేక ఆస్ట్రేలియా ప్రభుత్వం సతమతం అవుతోంది.

ఇలాంటి పరిస్థితి ఆస్ట్రేలియా, అమెరికాలకు మాత్రమే కాదు, అభివృద్ధి పేరుతో అత్యాశతో ప్రకృతిని పట్టించుకోకుండా ప్రవర్తించే ప్రతీ వారికి ఒక గుణపాఠం లాంటిది.

Reasons behind Australia Bush Fires
ఆస్ట్రేలియా అగ్గి అక్కడితో ఆరుతుందా.? ఆగుతుందా.?
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All