Homeటాప్ స్టోరీస్అటల్ బిహారి వాజ్ పేయి అంత్యక్రియలు పూర్తి

అటల్ బిహారి వాజ్ పేయి అంత్యక్రియలు పూర్తి

Atal bihari vajpayee funeral and last ritesమాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి అంత్యక్రియలు పూర్తయ్యాయి . లక్షలాదిమంది వెంట రాగా అశ్రునయనాల మధ్య అధికార లాంఛనాలతో ఈ అంత్యక్రియలు పూర్తయ్యాయి . వాజ్ పేయి కి దత్త పుత్రిక నమితా భట్టాచార్య చేతుల మీదుగా అంత్యక్రియలు జరగడం విశేషం . వాజ్ పేయి కి నివాళులర్పించిన వాళ్లలో మాజీ ప్రధానులు , వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రు లు , ప్రధాని మోడీ , బీజేపీ కురువృద్ధుడు అద్వానీ , అమిత్ షా లతో పాటుగా రాష్ట్రపతి , ఉప రాష్ట్రపతి లతో పాటుగా వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులున్నారు .

హిందూ సాంప్రదాయం ప్రకారం శాస్త్రోక్తంగా అంతిమ సంస్కారాలు నిర్వహించగా దత్త పుత్రిక తలకొరివి పెట్టడం విశేషం .భారత రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన మహానాయకుడు అటల్ బిహారి వాజ్ పేయి . ఒక్క పార్లమెంట్ సభ్యుడు మద్దతు ఇస్తే చాలు అధికార పీఠం నిలుపుకునే వాడు అయినప్పటికీ మిగతా రాజకీయ నాయకుల్లా పార్లమెంట్ సభ్యులను కొనుగోలు చేయకుండా నిజాయితీగా వ్యవహరించి ఒక్క ఓటు తోనే అధికార పీఠాన్ని వదిలిన గొప్ప రాజనీతిజ్ఞుడు అటల్ . మొదట 13 రోజుల ప్రధాన మంత్రిగా ఆ తర్వాత 13 నెలల పాటు పరిపాలన సాగించిన ప్రధానిగా అనతంరం పూర్తికాలం పదవిని చేపట్టిన ప్రధానిగా ఖ్యాతి గాంచాడు అటల్ బిహారి వాజ్ పేయి . దేశం ఓ గొప్ప రాజనీతిజ్ఞుడుని కోల్పోవడంతో శోకసంద్రం లో మునిగింది యావత్ భారతదేశం

- Advertisement -

English Title: Atal bihari vajpayee funeral and last rites

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All