Homeటాప్ స్టోరీస్అటల్ బిహారి వాజ్ పేయి ఇక లేరు

అటల్ బిహారి వాజ్ పేయి ఇక లేరు

atal bihari vajpayee is no moreభారతరత్న , మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్ పేయి(93) ఇక లేరు , ఈరోజు సాయంత్రం 5 గంటల 5 నిమిషాలకు తుది శ్వాస విడిచినట్లు ఎయిమ్స్ వైద్యులు అధికారికంగా ప్రకటించారు . గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వాజ్ పేయి మూత్ర పిండాలు ,మూత్రనాళ సమస్యతో బాధపడుతున్నాడు . జూన్ 11న వాజ్ పేయి ని ఎయిమ్స్ లో చేర్చారు కాగా అప్పటి నుండి ఐసియు లో చికిత్స పొందుతున్నాడు కాగా నిన్న మరింతగా ఆరోగ్యం విషమించడంతో హెల్త్ బులెటిన్ విడుదల చేసారు . దాంతో ప్రధాని నరేంద్ర మోడీ , ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తో సహా పలువురు భారతీయ జనతా పార్టీ నాయకులు ఎయిమ్స్ కు తరలివచ్చారు .

ఆజన్మ బ్రహ్మచారి అయిన అటల్ బిహారి వాజ్ పేయి 1924 డిసెంబర్ 25 న జన్మించారు . మూడుసార్లు దేశ ప్రధానిగా వ్యవహరించారు వాజ్ పేయి . కాంగ్రెసేతర ప్రధానుల్లో పూర్తికాలం పదవీ బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తి అటల్ . మొదట 1996 లో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు అయితే అప్పుడు కేవలం 13 రోజులు మాత్రమే అధికారంలో ఉన్నాడు ఆ తర్వాత 1998 నుండి 1999 వరకు 13 నెలల పాటు అధికారంలో ఉన్నాడు ఆ తర్వాత మళ్ళీ అధికారం చేపట్టి 1999 నుండి 2004 వరకు ప్రధాని గ వ్యవహరించారు . అటల్ బిహారి వాజ్ పేయి మృతి తో భారతీయ జనతా పార్టీ శోకసంద్రం లో మునిగింది . అటల్ మరణానికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తోంది జాతి యావత్తు .

- Advertisement -

English Title: atal bihari vajpayee is no more

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All