Homeటాప్ స్టోరీస్రాహుల్ చేష్టలతో షాక్ కి గురైన మోడీ

రాహుల్ చేష్టలతో షాక్ కి గురైన మోడీ

Prime minister mody shocked with rahul gandhi భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్ డి ఏ ప్రభుత్వం పై తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్బంగా సంచలన సంఘటన చోటు చేసుకుంది . ఎన్ డి ఏ ప్రభుత్వాన్ని , మోడీ ని చీల్చి చెండాడిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు , పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ ఒకవైపు మోడీ పై సంచలన ఆరోపణలు చేస్తూనే మరోవైపు ప్రధాని కూర్చున్న దగ్గరకు వెళ్లి ప్రధాని కి కరచాలనం అందించి , కౌగిలింత ఇచ్చి లోక్ సభ ని షాక్ కి గురి చేసాడు . ఇక ప్రధాని మోడీ అయితే రాహుల్ చేష్టలతో పూర్తిగా షాక్ అయ్యాడు ఏం జరుగుతుందో తెలియక షాక్ లోకి లోనైనా మోడీ తర్వాత తేరుకొని రాహుల్ ని మళ్ళీ వెనక్కి పిలిచి చెవిలో ఏదో మాట్లాడాడు .

మోడీ నా వైపు చూడటానికి ఇస్టపడటం లేదని , నా కళ్ళ లోకి చూడలేక పోతున్నాడని …… భారత్ లో ప్రతీ ఒక్కరు మోడీ వల్ల ఇబ్బంది పడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేసాడు రాహుల్ అంతేకాదు మోడీ , అమిత్ షా జోడి ప్రజల గొంతు ని నొక్కేస్తున్నారని , ప్రజా సేవకుడిని అంటూ వచ్చిన మోడీ అమిత్ షా తనయుడు అవినీతి కి పాల్పడుతుంటే మాత్రం కళ్ళు నోరు కట్టేసుకున్నాడని ……. మోడీ వస్తే ప్రతీ ఒక్కరి ఎకౌంట్ లో 15 లక్షల డబ్బులు పడతాయని ఆశిస్తే , జి ఎస్ టి తో, పెద్ద నోట్ల రద్దుతో దేశాన్ని నడిరోడ్డున నిలబెట్టాడని ఆరోపించాడు రాహుల్ గాంధీ .

- Advertisement -

English Title: Prime minister mody shocked with rahul gandhi

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All