Tuesday, March 21, 2023
Homeటాప్ స్టోరీస్125 కోట్ల క్లబ్ లో అరవింద సమేత

125 కోట్ల క్లబ్ లో అరవింద సమేత

Aravinda sametha joins 125 crores clubయంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన అరవింద సమేత 125 కోట్ల క్లబ్ లో చేరింది . ఈ విషయాన్నీ ఉమైర్ సందు ట్వీట్ చేస్తూ 125 కోట్ల క్లబ్ లో చేరిన అరవింద సమేత ఇంకా మంచి వసూళ్ళ ని రాబడుతోందని తెలిపాడు . అక్టోబర్ 11 న విడుదలైన అరవింద సమేత చిత్రానికి మొదటి నుండి పాజిటివ్ టాక్ రావడం ఒక కారణమైతే , దసరా సెలవులు రావడం మరో కారణంతో భారీ వసూళ్ళ ని సాధిస్తున్నాడు ఎన్టీఆర్ . ఓవర్ సీస్ లో అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో వసూళ్ళ వర్షం కురుస్తోంది . రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటివరకు 52 కోట్ల షేర్ రాబట్టి సంచలనం సృష్టించింది అరవింద సమేత .

- Advertisement -

ఓవర్ సీస్ లో వరుసగా నాలుగు చిత్రాలు 1.5 మిలియన్ డాలర్లు వసూల్ చేసిన ఏకైక హీరోగా రికార్డ్ సృష్టించాడు ఎన్టీఆర్ . అక్కడ కూడా ఇంకా మంచి వసూళ్ళ ని సాధిస్తోంది . ఓవర్ సీస్ లో రెండున్నర మిలియన్ డాలర్ల ని దాటేలా ఉంది అరవింద సమేత . 125 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన ఎన్టీఆర్ ఈ జోరు ఇలాగే మరో వారం కొనసాగితే 200 కోట్ల గ్రాస్ వసూళ్ళ ని సాధించడం ఖాయమేనని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు . బాక్సాఫీస్ వద్ద సరైన సినిమా ఏది లేకపోవడం కూడా అరవింద కు బాగా కలిసి వస్తోంది . ఈనెల 18 తర్వాత ఎన్టీఆర్ అసలు జోరు చూపించాలి .

English Title: Aravinda sametha joins 125 crores club

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts