Wednesday, March 22, 2023
Homeటాప్ స్టోరీస్వంద కోట్ల దిశగా అరవింద సమేత

వంద కోట్ల దిశగా అరవింద సమేత

NTR's Aravinda sametha towards 100 crores clubయంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ వంద కోట్ల దిశగా దూసుకుపోతోంది . అయితే ఉమైర్ సందు మాత్రం వంద కోట్ల గ్రాస్ ని దాటేసినట్లు ప్రకటించాడు . అక్టోబర్ 11 న విడుదలైన అరవింద సమేత చిత్రానికి మొదటి రోజున భారీ వసూళ్లు వచ్చాయి .మొత్తంగా మూడు రోజుల్లో వంద కోట్ల గ్రాస్ వసూల్ అయ్యాయని ఉమైర్ సందు పేర్కొన్నాడు . ఓవర్ సీస్ లో రెండు మిలియన్ డాలర్ల దిశగా దూసుకుపోతోంది అరవింద సమేత . ఇక తెలుగు రాష్ట్రాలలో కూడా దసరా సెలవులు కాబట్టి బాగానే వసూల్ చేస్తున్నాడు ఎన్టీఆర్ . అయితే కొన్ని చోట్ల వసూళ్లు మందగించాయి దానికి కారణం టికెట్ల రెట్లు బాగా పెంచడమే !

- Advertisement -

ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించడమే కాకుండా నాన్ బాహుబలి రికార్డులను అరవింద సమేత తుడిచి పెట్టేలా ఉంది . మరో నాలుగు రోజుల పాటు సెలవులు ఉన్నాయి కాబట్టి ఈ జోరు ఇలాగె కొనసాగితే తప్పకుండా వంద కోట్ల షేర్ ని దాటేసి రంగస్థలం రికార్డ్ ని బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది . రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించగా ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటించింది . తమన్ అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది .

English Title: NTR’s Aravinda sametha towards 100 crores club

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts