Homeటాప్ స్టోరీస్ఈశా రెబ్బా ని దెబ్బకొట్టిన త్రివిక్రమ్

ఈశా రెబ్బా ని దెబ్బకొట్టిన త్రివిక్రమ్

Trivikram insults telugu girlఅచ్చ తెలుగమ్మాయి ఈశా రెబ్బా కెరీర్ పై పెద్ద దెబ్బే కొట్టాడు దర్శకుడు త్రివిక్రమ్ . అరవింద సమేత చిత్రంలో ఈశా రెబ్బా కు క్యారెక్టర్ ఇచ్చాడు కదా ! ఆమె కెరీర్ పై దెబ్బ కొట్టడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? టాలీవుడ్ లో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిపోవాలని ఎన్నో ఆశలతో అడుగుపెట్టింది ఈశా రెబ్బా ! అందుకు తగ్గట్లుగా అంతకుముందు ఆ తర్వాత చిత్రం లో మంచి చాన్స్ లభించింది అలాగే లుక్స్ పరంగా కాని నటన పరంగా కానీ మంచి మార్కులే పడ్డాయి ఈ భామకు ఆ తర్వాత అల్లరి నరేష్ చేసిన బందిపోటు దెబ్బకొట్టింది . ఇక అరవింద సమేత వీర రాఘవ చిత్రానికి వస్తే …….. ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరో ,త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్ అలాగే భారీ నిర్మాణ సంస్థ దాంతో అరవింద సమేత చిత్రంలో నటించడానికి ఒప్పుకుంది కానీ ఈశా రెబ్బా క్యారెక్టర్ కు సినిమాలో అసలు ప్రాధాన్యత లేనే లేదు .

- Advertisement -

ప్రాధాన్యత లేని క్యారెక్టర్ ఈశా ఒప్పుకోవడం తప్పు , లేదంటే ఎక్కువ సన్నివేశాలు చిత్రీకరించి వాటిని ఎడిట్ చేసి సినిమాలో కొన్ని సన్నివేశాలే ఉంచారేమో ? ఏదైతేనేమి ఓ తెలుగుమ్మయికి తెలుగు సినిమాలో అన్యాయం జరిగింది . ఈ సినిమా దెబ్బతో హీరోయిన్ గా వెలిగిపోవాలని ఆశించే ఈశా రెబ్బా కు సైడ్ క్యారెక్టర్ లు మాత్రమే ఎక్కువగా వస్తాయి , ఒకవేళ హీరోయిన్ గా చాన్స్ లు వచ్చినా అవి చిన్న సినిమాల్లో తప్ప పెద్ద సినిమాల్లో మాత్రం రావు . తెలిసి చేసినా తెలియక చేసినా త్రివిక్రమ్ మాత్రం ఈశా రెబ్బా ని దెబ్బ కొట్టాడు . తెలుగమ్మాయిలు హీరోయిన్ గా పనికి రారని కేవలం సైడ్ క్యారెక్టర్ లు మాత్రమే చేసుకోవాలని మరోసారి హింట్ ఇచ్చారు అరవింద సమేత చిత్రంతో .

English Title: Trivikram insults telugu girl

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts