Homeటాప్ స్టోరీస్అరవింద సమేత చిత్రాన్ని ఆపేస్తారట

అరవింద సమేత చిత్రాన్ని ఆపేస్తారట

Rayalaseema students warns aravinda samethaరాయలసీమలో ఫ్యాక్షన్ అంతమై పోయి చాలా రోజులయ్యింది అలాంటిది మళ్ళీ పాత కక్ష్యలు చెలరేగేలా త్రివిక్రమ్ అరవింద సమేత వీర రాఘవ చిత్రాన్ని తీసాడని అందుకు అతడు క్షమాపణ చెప్పి సినిమాలోంచి రాయలసీమని కించపరిచేలా ఉన్న సన్నివేశాలను తొలగించాలని లేదంటే అరవింద సమేత చిత్రాన్ని ప్రదర్శిస్తున్న అన్ని థియేటర్ లను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు రాయలసీమ విద్యార్థులు . ఈరోజు సోమాజిగూడ లోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో దర్శకులు త్రివిక్రమ్ కు హెచ్చరికలు జారీ చేసారు .

ఇప్పటికే అరవింద సమేత చిత్ర కథ నాదే అంటూ గంగాధర్ అనే రచయిత వివాదం సృష్టించగా తాజాగా రాయలసీమ స్టూడెంట్స్ అరవింద సమేత చిత్రం పై నిప్పులు గక్కుతున్నారు . అరవింద సమేత చిత్ర ప్రదర్శన అడ్డుకుంటామని తీవ్ర స్థాయిలో హెచ్చరిస్తున్నారు . ముఖ్యంగా రాయలసీమలో అరవింద సమేత ప్రదర్శన అడ్డుకుంటామని అంటున్నారు . రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన అరవింద సమేత భారీ వసూళ్ళ ని సాధిస్తోంది దసరా పండగ సీజన్ లో .

- Advertisement -

English Title: Rayalaseema students warns aravinda sametha

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All