Homeన్యూస్అంటే సుందరానికి నుండి సాంగ్ స్టిల్ రిలీజ్

అంటే సుందరానికి నుండి సాంగ్ స్టిల్ రిలీజ్

అంటే సుందరానికి నుండి సాంగ్ స్టిల్ రిలీజ్
అంటే సుందరానికి నుండి సాంగ్ స్టిల్ రిలీజ్

శ్యామ్ సింగరాయ్ మూవీ తో సూపర్ హిట్ అందుకున్న నేచురల్ స్టార్ నాని..ప్రస్తుతం వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో అంటే సుందరానికి అనే మూవీ చేస్తున్నాడు. బ్రోచేవారేవరురా సినిమాతో హిట్ అందుకున్న వివేక్ ఆత్రేయ ఈ మూవీ లో నాని ని డిఫరెంట్ గా చూపించబోతున్నాడు. ఇందులో నాని సరసన మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్ హీరోయిన్‏గా నటిస్తోంది.

ఇక రీసెంట్ గా చిత్ర యూనిట్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు రిలీజ్ డేట్స్ ను ప్రకటించి… ఆవకాయ సీజన్ లో తమ ఆగమనం ఎప్పుడైనా ఉండొచ్చని అని తెలిపారు. ఇదిలా ఉంటె ఈ సినిమాలోని ఓ సాంగ్ పిక్చరైజేషన్ కు సంబంధించిన కొన్ని స్టిల్స్ బయటకు వచ్చాయి.

- Advertisement -

హీరోహీరోయిన్ల తో పాటు  శేఖర్ మాస్టర్ ఈ పిక్స్ లో చాల ఉత్సహంగా కనిపిస్తున్నాడు.మరి ఇది ఏ సాంగ్ కు సంబందించినవి అనేవి తెలియాల్సి ఉంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ బ్యానర్ పై నవీన్ యెర్నేని.. వై. రవిశంకర్ సంయుక్తంగా నిర్మించారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All