Homeటాప్ స్టోరీస్మరో ప్లాప్ బెల్లంకొండ వశం

మరో ప్లాప్ బెల్లంకొండ వశం

 

- Advertisement -

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటుడిగా మెప్పించాడు కానీ హీరోగా మాత్రం ఇంతవరకు సక్సెస్ కాలేకపోయాడు . కమర్షియల్ హీరో అంటే కమర్షియల్ సక్సెస్ కొట్టాల్సిందే కానీ ఈ హీరోకు మాత్రం ఇంతవరకు సాలిడ్ హిట్ దక్కలేదు . తాజాగా ఈ హీరో నటించిన సీత చిత్రం నిన్న విడుదల అయ్యింది . అయితే ఈ సీత చిత్రం కూడా ప్లాప్ జాబితాలో చేరిపోయింది . ఇప్పటికే పలు ప్లాప్ లతో సతమతం అవుతున్న ఈ హీరోకు సీత మరో ప్లాప్ గా నిలిచింది .

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన మొదటి చిత్రం అల్లుడు శీను మాత్రమే భారీ ఓపెనింగ్స్ సాధించింది ఇక మిగతా చిత్రాలన్నీ ఘోర పరాజయం పొందినవే ! అయితే గుడ్డిలో మెల్ల లాగా ఈ హీరోకు సక్సెస్ లేకపోయినా బిజినెస్ మాత్రం బాగానే జరుగుతోంది . అలాగే హిందీ డబ్బింగ్స్ రైట్స్ రూపంలో కూడా భారీ మొత్తమే వస్తోంది , వీటికి తోడు బెల్లంకొండకు సరైన హిట్ పడితే మాత్రం బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం ఎందుకంటే ప్లాప్ చిత్రాలతో కూడా భారీ ఓపెనింగ్స్ సాధిస్తున్నాడు . అలాగే మంచి బిజినెస్ కూడా జరుగుతోంది . ఇక ఈ హీరోకు కావాల్సింది కమర్షియల్ సక్సెస్ అది ఎప్పుడు వస్తుందో ?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All