Tuesday, March 21, 2023
Homeటాప్ స్టోరీస్సీత రివ్యూ

సీత రివ్యూ

Sita Movie Review in Telugu
Sita Poster

నటీనటులు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , కాజల్ అగర్వాల్ ,
సంగీతం : అనూప్ రూబెన్స్
నిర్మాత : సుంకర రామబ్రహ్మం
దర్శకత్వం : తేజ
రేటింగ్ : 2. 5 / 5
రిలీజ్ డేట్ : 24 మే 2019

- Advertisement -

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ – కాజల్ అగర్వాల్ జంటగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సీత. టీజర్ , ట్రైలర్ లతో ఈ చిత్రంపై వివాదం చుట్టుకుంది. మరి పవిత్రమైన సీత పేరుతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా ఉందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ :
సీత ( కాజల్ అగర్వాల్ ) స్వార్ధ పరురాలు . డబ్బు కోసం , తన బాగు కోసం ఎలాంటి పనినైనా చేయడానికి సిద్దపడే అమ్మాయి . అందగత్తె అయిన సీత ని పెళ్లి చేసుకోవాలని ఆశపడతాడు ఎం ఎల్ ఏ బసవ ( సోనూ సూద్ ) . అయితే బసవ ప్రేమని నిరాకరిస్తుంది సీత కాకపోతే కొద్దిరోజులు డేటింగ్ చేద్దాం అని భారీ మొత్తం లో డబ్బు తీసుకోవడానికి ఒప్పుకుంటుంది . అయితే అలా సహజీవనం చేయడానికి ఒప్పుకున్న సీత ఆ తర్వాత చిక్కుల్లో పడుతుంది . దాంతో సీత ని రఘురాం ( బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ) ఆ చిక్కులోంచి ఎలా కాపాడాడు ? చివరకు ఏమైంది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలైట్స్ :
కాజల్ అగర్వాల్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్
సోనూ సూద్
పాయల్ రాజ్ పుత్ బుల్ రెడ్డి పాట

డ్రా బ్యాక్స్ :
స్క్రీన్ ప్లే

నటీనటుల ప్రతిభ :
సీత పాత్రలో కాజల్ అగర్వాల్ అద్భుతంగా నటించింది . ఈ చిత్రాన్ని తన భుజస్కంధాలపై మోసి వెన్నెముకగా నిలిచింది . స్వార్ధపూరిత పాత్రలో కాజల్ అభినయం బాగుంది . అలాగే బోల్డ్ గా నటించి మెప్పించింది కూడా . ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు నిజంగా మరోసారి నటనకు అవకాశం ఉన్న పాత్ర లభించింది . అక్కడక్కడా బెల్లంకొండ పాత్ర అంతగా పేలలేదు కానీ చివరి అరగంట మాత్రం హైలెట్ గా నిలిచింది . అలాగే తనకు లభించిన ఛాన్స్ ని సద్వినియోగం చేసుకున్నాడు ఈ హీరో . క్లైమాక్స్ లో అదరగొట్టాడు బెల్లంకొండ , సోనూ సూద్ కు కూడా నటనకు అవకాశం ఉన్న పాత్ర లభించింది . మన్నారా చోప్రా గ్లామర్ తో అలరించింది . ఇక స్పెషల్ సాంగ్ లో పాయల్ రాజ్ పుత్ కుర్రాళ్లకు విందు చేసింది . బిత్తిరి సత్తి మంచి రిలీఫ్ నిచ్చాడు తన కామెడీతో .

సాంకేతిక వర్గం :
అనూప్ రూబెన్స్ సంగీతంతో అలరించాడు . బుల్ రెడ్డి అనే పాట యూత్ ని బాగా ఆకట్టుకుంది . విజువల్స్ బాగున్నాయి . రాజీపడకుండా నిర్మించి తమ నిర్మాణ దక్షత చూపించారు . ఇక దర్శకుడు తేజ విషయానికి వస్తే …… మంచి కథ ని ఎంచుకున్నాడు కానీ స్క్రీన్ ప్లే పరంగా ఆ మ్యాజిక్ చేయలేకపోయాడు . ఫస్టాఫ్ ని బాగానే రాసుకున్నప్పటికీ సెకండాఫ్ కు వచ్చేసరికి కాస్త తేలిపోయాడు . అయితే చివరి అరగంట మళ్ళీ సంస్కృతీ సంప్రదాయాల విలువలను చూపించి మెప్పించాడు .

ఓవరాల్ గా :
సీత ని ఓసారి చూడొచ్చు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts

సీత రివ్యూ: సీత ( కాజల్ అగర్వాల్ ) స్వార్ధ పరురాలు . డబ్బు కోసం , తన బాగు కోసం ఎలాంటి పనినైనా చేయడానికి సిద్దపడే అమ్మాయి . అందగత్తె అయిన సీత ని పెళ్లి చేసుకోవాలని ఆశపడతాడు ఎం ఎల్ ఏ బసవ ( సోనూ సూద్ ) . అయితే బసవ ప్రేమని నిరాకరిస్తుంది సీత కాకపోతే కొద్దిరోజులు డేటింగ్ చేద్దాం అని భారీ సీత రివ్యూ