Homeటాప్ స్టోరీస్సీత విజయం పై ధీమాగా ఉన్న బెల్లంకొండ

సీత విజయం పై ధీమాగా ఉన్న బెల్లంకొండ

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సీత విజయం పట్ల చాలా నమ్మకంగా ఉన్నాడు . ఇన్నాళ్లు నేను చేసిన చిత్రాలన్నీ ఒక ఎత్తు ఈ సీత చిత్రం ఒక ఎత్తు అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాడు . అలాగే అల్లుడు శీను చిత్రం తర్వాత మళ్ళీ సీత చిత్రంలోనే కామెడీ చేసానని అలాగే ఇన్నాళ్లు యాక్షన్ కే పరిమితం అయ్యానని కానీ తొలిసారి విభిన్నంగా కనిపిస్తానని అంటున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ .

- Advertisement -

తేజ దర్శకత్వంలో తెరకెక్కిన సీత చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది . మోడ్రన్ సీత కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం వివాదాస్పదం అయ్యే ఛాన్స్ ఉంది . ఇప్పటికే పలువురు హిందూ వాదులు సీత చిత్రాన్ని బ్యాన్ చేయాలంటూ గొడవ చేస్తున్నారు . అదే ఈ సినిమాకు బలం అవుతుందని తప్పఁకుండా కమర్షియల్ హిట్ అవుతుందన్న విశ్వాసంతో ఉన్నాడు ఈ యంగ్ హీరో

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All