Homeటాప్ స్టోరీస్అమర్ అక్బర్ ఆంటోనీ రివ్యూ

అమర్ అక్బర్ ఆంటోనీ రివ్యూ

amar akbar anthony movie reviewఅమర్ అక్బర్ ఆంటోనీ రివ్యూ :
నటీనటులు : రవితేజ , ఇలియానా ,సునీల్
సంగీతం : తమన్
నిర్మాణం : మైత్రి మూవీస్
దర్శకత్వం : శ్రీను వైట్ల
రేటింగ్ : 3 /5
రిలీజ్ డేట్ : 16 నవంబర్ 2018

రవితేజశ్రీను వైట్ల కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన మూడు చిత్రాలు హిట్ కావడంతో అమర్ అక్బర్ ఆంటోనీ పై అంచనాలు ఏర్పడ్డాయి . అలాగే హాట్ భామ ఇలియానా రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రం కూడా ఈ అమర్ అక్బర్ ఆంటోనీ అయితే ఆ అంచనాలు ఈ సినిమా అందుకుందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .

కథ :

- Advertisement -

అమర్ (రవితేజ ) ఐశ్వర్య (ఇలియానా ) తల్లిదండ్రులు అమెరికాలో స్థిరపడిన తెలుగువాళ్లు . వాళ్ళ కంపెనీ లో కస్టపడి పనిచేసిన నలుగురి కి పార్ట్ నర్ షిప్ ఇస్తారు . అయితే అమర్ , ఐశ్వర్య లతో అటుగా వాళ్ళ రెండు కుటుంబాలను చంపేస్తే మొత్తం ఆస్థి వీళ్ళ వశం అవుతుందని భావించి బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ వేస్తారు , అయితే ఆ బ్లాస్ట్ లో అమర్ , ఐశ్వర్య లు తప్పించుకుంటారు . తమ తల్లిదండ్రులను చంపిన వాళ్ళని చంపాలని కంకణం కట్టుకుంటాడు అమర్ . తల్లిదండ్రులను చంపిన హంతకులను అమర్ చంపాడా ? అక్బర్ ఎవరు ? ఆంటోనీ ? ఎవరు అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

రవితేజ
చంద్రహాస్
శ్లోక
రికార్డింగ్
నిర్మాణ విలువలు
ఎంటర్ టైన్ మెంట్

డ్రా బ్యాక్స్ :

స్క్రీన్ ప్లే

నటీనటుల ప్రతిభ :

రవితేజ అమర్ క్యారెక్టర్ లో బాగా నటించాడు , అలాగే అక్బర్ , ఆంటోనీ పాత్రల్లో తేడా లు చూపించాడు అయితే ఈ మూడు క్యారెక్టర్ లు ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అయ్యాడు . రవితేజ తన క్యారెక్టర్ మటుకు బాగానే చేసాడు కానీ అంతకుమించి అతను చేయగలిగింది ఏమి లేకుండా పోయింది పాపం . ఇలియానా ముద్దుగుమ్మ లా ఉంది , చాలా బొద్దుగా కనిపించి కిక్ ఇచ్చింది అయితే ఇలియానా పాత్రకు కూడా అంతగా నటించడానికి స్కోప్ లేకుండా పోయింది . ఈ సినిమాలో హైలెట్స్ ఏంటంటే …… రవితేజ – ఇలియానా చిన్నప్పటి క్యారెక్టర్ లు పోషించిన చంద్రహాస్ – శ్లోక లు బాగా నటించారు . నటనకు కొత్తవాళ్లు అయినప్పటికీ ఆ బెరుకు ఎక్కడా కనిపించలేదు . చాలాకాలం తర్వాత గెస్ట్ పాత్రలో కనిపించింది లయ . ఇక ఈ సినిమాలో కమెడియన్స్ చాలామంది ఉన్నారు అందరూ కూడా నవ్వించే ప్రయత్నం చేసారు అయితే వెన్నెల కిషోర్ , సత్య ల కామెడి ప్రేక్షకులను అలరించడం ఖాయం . ఇక విలన్ ల విషయానికి వస్తే వాళ్ళని అనుకున్న స్థాయిలో ఉపయోగించుకోలేక పోయారు .

సాంకేతిక వర్గం :

మైత్రి మూవీస్ నిర్మాణ విలువల గురించి కొత్తగా చెప్పేదేముంది , బాగా ఖర్చుపెట్టారు . తమన్ అందించిన పాటలు అంతగా ఆకట్టుకునేలా లేవు కానీ రీ రికార్డింగ్ తో ఆకట్టుకున్నాడు . విజువల్స్ చాలా బాగున్నాయి . ఇక దర్శకుడు శ్రీను వైట్ల విషయానికి వస్తే …….. మూడు ప్లాప్ ల తర్వాత వచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేసాడు . ట్విస్ట్ ల కోసం కథ , కథనం తో అక్కడక్కడా విసిగించాడు . అయితే పక్కా రివెంజ్ డ్రామా గా చేసి ఉంటే ఇంకా బాగుండేది .

 

ఓవరాల్ గా :

ఎంటర్ టైన్ మెంట్ కోసం , రవితేజ – ఇలియానా ల కోసం ఒకసారి చూడొచ్చు .

English Title: amar akbar anthony movie review

                                      Click here for English Review

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All