Homeటాప్ స్టోరీస్అమర్ అక్బర్ ఆంటోనీ సెన్సార్ టాక్

అమర్ అక్బర్ ఆంటోనీ సెన్సార్ టాక్

Raviteja's Amar Akbar Antony censor talk మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన చిత్రం అమర్ అక్బర్ ఆంటోనీ . శ్రీను వైట్ల దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ భారీ చిత్రం ఈనెల 16 న విడుదల అవుతోంది . ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తిచేసుకుంది . ఈ చిత్రాన్ని తిలకించిన సెన్సార్ సభ్యులు యు /ఏ సర్టిఫికేట్ ఇచ్చారు . ఇక సెన్సార్ పూర్తికావడంతో అసలు ఘట్టం మాత్రమే మిగిలిఉంది . అట్టహాసంగా సినిమా విడుదల అవ్వడమే ఆలస్యం అన్నమాట . సెన్సార్ టాక్ ప్రకారం అమర్ అక్బర్ ఆంటోనీ ప్రేక్షకులను విశేషంగా అలరించడం ఖాయమని అంటున్నారు . హాస్యంతో పాటుగా యాక్షన్ దృశ్యాలు అలాగే ఇలియానా గ్లామర్ ఈ సినిమాకు ఎస్సెట్ కానున్నాయని సమాచారం .

రవితేజ మాస్ మహారాజ్ బిరుదు కి తగ్గట్లుగా మూడు వేరియేషన్ లలో వినోదాన్ని పంచడమే కాకుండా యాక్షన్ ఎపిసోడ్ లతో ఆకట్టుకోవడం ఖాయమని , తన ఎనర్జీతో అమర్ అక్బర్ ఆంటోనీ గా మెప్పించడానికి టాక్ . అలాగే శ్రీను వైట్ల అంటే వినోదానికి పెద్ద పీట అనే విషయం విదితమే ! దాంతో ఈ సినిమాలో కూడా పలువురు నటీనటులపై చిత్రీకరించిన సెటైర్ కామెడి ప్రేక్షకులను అలరించేలా ఉందట . ఇక ఇలియానా గ్లామర్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణ దాంతో ఈనెల 16 న విడుదల కానున్న ఈ చిత్రానికి విజయం దక్కడం ఖాయంగా కనబడుతోంది . మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు , రవితేజ – ఇలియానా జోడి , శ్రీను వైట్ల మార్క్ వెరసి అమర్ అక్బర్ ఆంటోనీ సక్సెస్ ఫుల్ మూవీ అని అంటున్నారు . టాక్ బాగుంది ప్రేక్షకులకు నచ్చితే రవితేజ , శ్రీను వైట్ల , ఇలియానా లతో పాటుగా మైత్రి కి కూడా భారీ విజయం ఖాయమేమో !

- Advertisement -

English Title: Raviteja’s Amar Akbar Antony censor talk

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All