Homeటాప్ స్టోరీస్శ్రీను వైట్ల కాన్ఫిడెంట్ గా ఉన్నాడే !

శ్రీను వైట్ల కాన్ఫిడెంట్ గా ఉన్నాడే !

Director Srinu vaitla confident on amar akbar antony అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు దర్శకులు శ్రీను వైట్ల . ఒకప్పుడు అగ్ర దర్శకుడిగా ఓ వెలుగు వెలిగిన శ్రీను వైట్ల ప్రస్తుతం కెరీర్ లోనే గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు . శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు గత మూడేళ్ళుగా ఘోర పరాజయం పొందుతుండటంతో అసలు కెరీర్ మొత్తం డైలమాలో పడింది దాంతో తన తప్పులు ఏంటో తెలుసుకొని చేసిన సినిమా ఈ అమర్ అక్బర్ ఆంటోనీ అని , తప్పకుండా హిట్ కొట్టబోతున్నామని కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు . అయితే ఇది శ్రీను వైట్ల కాన్ఫిడెన్స్ తో చెబుతున్న మాటలా ? లేక ఓవర్ కాన్ఫిడెన్స్ తో చెబుతున్న మాటలా ? అన్నది ఈనెల 16 న తేలిపోనుంది .

రవితేజ తో పాటు ఇలియానా కు అలాగే శ్రీను వైట్ల కు తప్పకుండా విజయం కావాలి అందుకోసమే ముగ్గురూ కలిశారు కసిగా పనిచేసారు అని అంటున్నారు . ఇక సెన్సార్ టాక్ ప్రకారం సినిమా గొప్పగా ఏమిలేదు కానీ పైసా వసూల్ సినిమా అని , మంచి ఎంటర్ టైన్ మెంట్ తో పాటుగా యాక్షన్ సీక్వెన్స్ కూడా ప్రేక్షకులను అలరించడం ఖాయమని టాక్ . సెన్సార్ టాక్ బాగుంది కాబట్టి చిత్ర బృందం కూడా చాలా సంతోషంగా ఉంది . ఇక రవితేజ అలాగే ఇలియానా కూడా అమర్ అక్బర్ ఆంటోనీ విజయం పట్ల ధీమాగా ఉన్నారు .

- Advertisement -

English Title: Director Srinu vaitla confident on amar akbar antony

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All