Homeగాసిప్స్పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఆచార్య?

పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఆచార్య?

పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఆచార్య?
పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఆచార్య?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తోన్న సినిమా ఆచార్య. ఈ సినిమా టైటిల్ ను మెగాస్టార్ అనుకోకుండా చెప్పినప్పటి నుండి ఇది జనాల్లోకి బలంగా వెళ్ళింది. కొరటాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా షూటింగ్ ను జూన్ కల్లా పూర్తి చేసి ఆగష్టులో చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు.

ఆచార్య విషయంలో జనాల్లో ఇప్పటికే పలు రూమర్లు ఉన్నాయి. ఈ సినిమా దేవాలయాల్లో జరిగే అవినీతికి వ్యతిరేకంగా ఒక వ్యక్తి సాగించే పోరాటమని తెలుస్తోంది. మరోసారి కొరటాల శివ సోషల్ మెసేజ్ తో వస్తున్నాడని దీన్ని బట్టి అర్ధమవుతోంది. అయితే తాజాగా ఈ చిత్రం గురించి మరో విశేషం బయటపడింది. చిత్ర యూనిట్ కు క్లోజ్ అయిన వర్గాలు చెప్పిన సమాచారం ప్రకారం ఈ చిత్రం 90ల బ్యాక్ డ్రాప్ లో జరుగుతుందిట. కథ మొత్తం 1990ల కాలం నాటి పరిస్థితులకు తగ్గట్లుగా ఉంటుందని తెలుస్తోంది. అప్పటి కాలానికి తగ్గట్లుగా ఎక్కడికక్కడ సెట్స్ కూడా వేస్తున్నారట. అందుకే షూటింగ్ అనుకున్నదాని కన్నా ఆలశ్యమవుతున్నట్లు సమాచారం.

- Advertisement -

ఇటీవలే లీకైన పిక్స్ లో కూడా చిరంజీవి అప్పటి కాలానికి తగ్గట్లుగా లుక్ లోనే దర్శనమిచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇక ఈ చిత్రంలో స్పెషల్ రోల్ గురించి సస్పెన్స్ అలాగే కొనసాగుతోంది. రామ్ చరణ్ కాకుండా ఈ సినిమాలో మహేష్ బాబు ఆ పాత్రలో నటించనున్నాడని తెలుస్తోంది. ముందుగా నక్సలైట్ పాత్ర అనుకున్నా మహేష్ వచ్చి చేరడంతో దాన్ని స్టూడెంట్ లీడర్ పాత్రగా మార్చినట్లు సమాచారం. మరి దీనిపై కూడా అధికారిక ప్రకటన త్వరలోనే వస్తుందంటున్నారు.

ఉగాది సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు. త్రిష ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోన్న విషయం తెల్సిందే. ఈ వారమే ఆమె సెట్స్ లో పాల్గొంటుంది. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఒక ప్రత్యేక పాత్రలో రెజీనా మెగాస్టార్ సరసన ఆడిపాడింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All