Homeటాప్ స్టోరీస్చిరు- కొరటాల శివ... షూటింగ్ షురూ

చిరు- కొరటాల శివ… షూటింగ్ షురూ

చిరు- కొరటాల శివ... షూటింగ్ షురూ
చిరు- కొరటాల శివ… షూటింగ్ షురూ

మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహ రెడ్డి చిత్రం తర్వాత తన తర్వాతి సినిమాకు సంబంధించి షూటింగ్ ను ఈరోజు నుండి మొదలుపెట్టబోతున్నాడు. చిరంజీవి 152వ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు దసరా సందర్భంగా ముహూర్తం కూడా జరిపారు. అయితే ఈ చిత్రం సెట్స్ పైకి రావడానికి దాదాపు మూడు నెలలు పట్టింది. చాలా హుందాతనం కలిగిన రోల్ కావడంతో చిరు ఈ పాత్రకు తగ్గట్లుగా రెడీ అవ్వడానికి ఈ సమయం పెట్టినట్లుగా తెలుస్తోంది. గత నెలలో చిరంజీవిపై టెస్ట్ లుక్ చేసిన కొరటాల శివ దాంతో సంతృప్తి చెందడంతో ఈరోజు నుండి షూటింగ్ మొదలుపెడుతున్నాడు.

కోకాపేటలో స్పెషల్ గా వేసిన సెట్ లో చిరంజీవి, తదితరులు పాల్గొంటుండగా తొలి షెడ్యూల్ మొదలైంది. సంక్రాంతి వరకూ ఈ సినిమా మొదటి షెడ్యూల్ కొనసాగుతుంది. రెండో షెడ్యూల్ సంక్రాంతి తర్వాత పలు రోజులు విరామం ఇచ్చి మొదలుపెడతారు. ఆగష్టు 14కి ఈ చిత్రాన్ని విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నారు.

- Advertisement -

కొరటాల శివ తొలిసారి మణిశర్మతో కలిసి ఈ చిత్రం కోసం పనిచేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి మూడు పాటలను కంపోజ్ చేసాడు మెలోడీ బ్రహ్మ. త్రిష కథానాయికగా నటించనున్న ఈ చిత్రంలో చిరంజీవి దేవాదాయ శాఖలో పనిచేసే వ్యక్తిగా కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే. ఇంకా ఈ చిత్రంలో రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో కనిపిస్తాడని కూడా వార్తలు వస్తున్నాయ్.

నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All