Homeన్యూస్ఎవరు మీలో కోటీశ్వరులు: కోటి గెలుచుకున్న యువకుడు

ఎవరు మీలో కోటీశ్వరులు: కోటి గెలుచుకున్న యువకుడు

ఎవరు మీలో కోటీశ్వరులు: కోటి గెలుచుకున్న యువకుడు
ఎవరు మీలో కోటీశ్వరులు: కోటి గెలుచుకున్న యువకుడు

బ్రిటన్ గేమ్ షో హూ వాంట్స్ టు బి ఏ మిలియనీర్ కు తెలుగు అడాప్టేషన్ గా టెలికాస్ట్ అవుతోంది ఎవరు మీలో కోటీశ్వరులు షో. ఈ కార్యక్రమానికి హోస్ట్ గా ఎన్టీఆర్ వ్యవహరిస్తోన్న విషయం తెల్సిందే. ఈ షో ఆగస్ట్ మొదలుకాగా ఎన్టీఆర్ దీన్ని విజయవంతంగా హోస్ట్ చేస్తున్నాడు. ఐపీఎల్ కారణంగా కొంత డౌన్ అయినప్పటికీ మొత్తంగా టిఆర్పిలు అయితే డీసెంట్ గానే ఉన్నాయి.

తాజా సమాచారం ప్రకారం ఈ షో లో ఒక వ్యక్తి కోటి రూపాయలను గెలుచుకున్నాడట. అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పడం ద్వారా హయ్యస్ట్ అమౌంట్ కోటి రూపాయల బహుమతిని గెలుచుకున్నాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ ఎపిసోడ్ ను టెలికాస్ట్ చేయనున్నారు. ఎవరు మీలో కోటీశ్వరులు షో లో కోటి రూపాయలు గెలుచుకోవడం ఇదే తొలిసారి.

- Advertisement -

ఇక పోతే ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్స్ కూడా విచ్చేస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్, కొరటాల శివ, ఎస్ ఎస్ రాజమౌళి రాగా సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చిన ఎపిసోడ్ ను దసరాకు టెలికాస్ట్ చేయనున్నారు. త్వరలోనే ఎవరు మీలో కోటీశ్వరులు షో సీజన్ ఎండ్ కానుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All