
యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాప్ హీరోగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్యాన్ ఇండియా రేంజ్ చిత్రం చేస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ కు ఖరీదైన కార్స్ అంటే కూడా చాలా మక్కువ. రీసెంట్ గా ఎన్టీఆర్ లాంబోర్గిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ ను కొనుగోలు చేసిన విషయం తెల్సిందే. ఈ వార్త రీసెంట్ గా వైరల్ అయింది. అందరూ ఈ కార్ గురించి ఎంక్వయిరీ చేయడం మొదలుపెట్టారు. భారతదేశంలోనే మొట్టమొదటి కార్ ఇదని చెబుతున్నారు.
ఇప్పుడు మరోసారి ఈ కార్ వార్తల్లోకెక్కింది. ఈ కార్ రిజిస్ట్రేషన్ నెంబర్ కోసం ఎన్టీఆర్ భారీగానే ఖర్చు పెట్టాడట. ఎన్టీఆర్ కు 9999 నెంబర్ అంటే సెంటిమెంట్. తన వాహనాలు అన్నిటికీ కూడా అదే నెంబర్ కోరుకుంటాడు. లాంబోర్గిని ఉరుస్ కార్ కు 9999 నెంబర్ కోసం ఎన్టీఆర్ దాదాపుగా 17 లక్షలు ఖర్చు పెట్టినట్లు సమాచారం.
TS 09 FS 9999 నెంబర్ కోసం ఖైరతాబాద్ ఆర్టిఎ కార్యాలయంలో జరిగిన వేలంపాటలో ఎన్టీఆర్ ఇంత రేటు పెట్టి నెంబర్ కు తనకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. దీంతో కార్ మరోసారి వార్తల్లోకెక్కింది.