Homeన్యూస్ఆహా 2.0: ప్రతీ శుక్రవారం ఒక రిలీజ్!!!

ఆహా 2.0: ప్రతీ శుక్రవారం ఒక రిలీజ్!!!

ఆహా 2.0: ప్రతీ శుక్రవారం ఒక రిలీజ్!!!
ఆహా 2.0: ప్రతీ శుక్రవారం ఒక రిలీజ్!!!

ఓటిటి ప్లాట్ ఫామ్ లో తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహా. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్ వంటి భారీ ఓటిటి సంస్థల నుండి పోటీను తట్టుకుని తెలుగు ప్రేక్షకుల నెంబర్ 1 ఛాయస్ గా నిలిచింది ఆహా. నిన్న రాత్రి ఆహా 2.0 ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రతీ శుక్రవారం ఒక గ్రాండ్ రిలీజ్ ఆహా ప్లాట్ ఫామ్ లో విడుదలవుతుందని తెలిపాడు. మొత్తంగా 8 డిజిటల్ ప్రీమియర్స్, 10 ఆహా ఒరిజినల్స్ రానున్న రోజుల్లో విడుదల కానుంది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్, డీజే టిల్లు, లక్ష్యా, పుష్పక విమానం, రొమాంటిక్, అనుభవించు రాజా, మంచి రోజులు వచ్చాయి, గని చిత్రాలు ఆహాలోనే ప్రీమియర్ కానున్నాయి. వీటితో పాటు రానున్న రోజుల్లో 10 ఆహా ఒరిజినల్స్ అయిన సేనాపతి, భామా కలాపం, 3 రోజెస్, అన్యాస్ ట్యుటోరియల్, అడల్టింగ్, ఇట్స్ నాట్ ఏ లవ్ స్టోరీ, సేగు టాకీస్, ఇంటింటి రామాయణం, కాబూల్ హై, సర్కార్, అన్ స్టాపబుల్ సిరీస్ లు సిద్ధమవుతున్నాయి.

- Advertisement -

గత సంవత్సరంలో సబ్స్క్రైబర్స్ డబల్ అయ్యారని, అందరి సపోర్ట్ కు థాంక్స్ అని చెప్పుకొచ్చాడు ఆహా హెడ్ అల్లు అరవింద్.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All