Homeటాప్ స్టోరీస్హిందీ రిలీజ్ ఇష్యూ ను డీల్ చేస్తోన్న అల్లు అర్జున్

హిందీ రిలీజ్ ఇష్యూ ను డీల్ చేస్తోన్న అల్లు అర్జున్

హిందీ రిలీజ్ ఇష్యూ ను డీల్ చేస్తోన్న అల్లు అర్జున్
హిందీ రిలీజ్ ఇష్యూ ను డీల్ చేస్తోన్న అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప ది రైజ్ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయనున్న విషయం తెల్సిందే. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే అంతకంటే ముందు ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ ను ఒక ప్రముఖ సంస్థకు అమ్మేసారు.

తెలుగు చిత్రాలకు హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో మంచి ఆదాయం వస్తుంది. అందులోనూ అల్లు అర్జున్ సినిమాలు వందల మిలియన్ వ్యూస్ ను సాధించాయి. దీంతో పుష్ప లాంచ్ సమయం అప్పుడే హిందీ డబ్బింగ్ రైట్స్ ను అమ్మేసారు నిర్మాతలు. దీంతో ఇప్పుడు పుష్ప హిందీ థియేట్రికల్ రిలీజ్ కు సదరు సంస్థ ఒప్పుకోవట్లేదు.

- Advertisement -

ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. అవి ముగిసేవరకూ హిందీ రిలీజ్ హోల్డ్ లో ఉన్నట్లే. అందుకే రీసెంట్ గా విడుదలైన పుష్ప సాంగ్ ను కూడా హిందీ వెర్షన్ లో విడుదల చేయలేదు. మైత్రి మూవీ మేకర్స్ తో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ విషయంలో యాక్టివ్ గా చర్చల్లో పాల్గొంటున్నాడట. మరికొన్ని రోజుల్లో ఈ ఇష్యూ సమసిపోతుందని భావిస్తున్నారు.

రష్మిక మందన్న ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు. డిసెంబర్ 17న పుష్ప ది రైజ్ విడుదలకు షెడ్యూల్ అయింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All