Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ స్పెష‌ల్ గిఫ్ట్ అదిరిందిగా!

ఎన్టీఆర్ స్పెష‌ల్ గిఫ్ట్ అదిరిందిగా!

ఎన్టీఆర్ స్పెష‌ల్ గిఫ్ట్ అదిరిందిగా!
ఎన్టీఆర్ స్పెష‌ల్ గిఫ్ట్ అదిరిందిగా!

వెండితెర‌పై త‌న‌దైన స్టైల్ యాక్ష‌న్‌తో ఆక‌ట్టుకుంటున్న స్టార్ హీరో యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు నేడు. .. రామాయ‌ణంలో బుల్లి రాముడిగా ఆక‌ట్టుకున్నా.. ఆ త‌రువాత `నిన్ను చూడాలి` అంటూ కాలేజీ ప్రేమికుడిగా అల‌రించే ప్ర‌య‌త్నం చేశారు.. కానీ ఎన్టీఆర్‌లోని హై ఓల్టేజ్ ప‌వ‌ర్‌ని బ‌య‌టికి తీసి అత‌నిలో వున్న న‌టుడిని యావ‌త్ ప్ర‌పంచానికి, మాస్ ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌ర చేసిన చిత్రం `ఆది`. మాస్ యాక్ష‌న్ చిత్రాల ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్ తెర‌కెక్కించిన ఈ చిత్రం ఇండ‌స్ట్రీ రికార్డుల్ని తిర‌గ‌రాసి ఎన్టీఆర్ స‌త్తా ఏంటో నిరూపించింది. ఆదికేశ‌వ‌రెడ్డిగా ఫ్యాక్ష‌న్‌ చిత్రాల్లోనే స‌రికొత్త చ‌రిత్ర‌కు ఈ సినిమాతో ఎన్టీఆర్ శ్రీ‌కారం చుట్టారు.

ఆ త‌రువాత బాక్సాఫీస్‌కి `సింహాద్రి`గా మారిన ఎన్టీఆర్ స్టార్‌గా ఎదుగుతున్న క్ర‌మంలో స‌డ‌న్‌గా కొన్ని ఫ్లాప్‌లు చూశారు. అప్పుడే జ‌క్క‌న్న `య‌మ‌దొంగ‌`తో బంప‌ర్ హిట్‌ని అందించింది. అక్క‌డి నుంచి ఎన్టీఆర్ ఇక వెనుదిరిగి చూసుకోలేదు. కంత్రిగా అదుర్స్ అనిపిస్తూ వ‌రుస విజ‌యాల్ని త‌న ఖాతాలో వేసుకుంటూ స్టార్ హీరోగా త‌న స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. గాయ‌కుడిగానూ త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు. `బాద్ షా` చిత్రంతో ర‌జ‌నీ త‌రువాత జ‌పాన్‌లోనూ అభిమానుల్ని సొంతం చేసుకున్నారు.

- Advertisement -

బృందావ‌నం,  టెంప‌ర్‌, నాన్న‌కు ప్రేమ‌తో చిత్రాలు ఎన్టీఆర్ ఊర మాస్ మ‌సాలా చిత్రాల‌కే కాదు స్టైలిష్ యాక్ష‌న్ చిత్రాలు కూడా చేయ‌గ‌ల‌ర‌ని నిరూపించి ఆయ‌న కెరీర్‌కి కొత్త బాట‌లు వేశాయి. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ న‌టిస్తున్న చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ న‌టిస్తున్ననాలుగ చిత్ర‌మిది. స్టూడెంట్ నెం.1, సింహాద్రి, య‌మ‌దొంగ చిత్రాలు వీరి క‌ల‌యిక‌లో వ‌చ్చినే విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం చేస్తున్న `ఆర్ ఆర్ ఆర్‌`పై దేశ వ్యాప్తంగా భారీ అంచ‌నాలున్నాయి. డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమ‌రం భీంగా క‌నిపించ‌బోతున్నారు.

ఎన్టీఆర్ ఫ‌స్ట్ లుక్‌కి సంబంధించిన టీజ‌ర్‌ని రిలీజ్ చేస్తార‌ని ఫ్యాన్స్ వేయిక‌ళ్ల‌తో ఎదురుచూశారు. అయితే లాక్‌డౌన్ కార‌ణంగా అది కుద‌ర‌డం లేద‌ని చిత్ర బృందం, ఎన్టీఆర్ వివ‌ర‌ణ ఇచ్చారు. దీంతో నిరాశ‌కు గురుఐన ఫ్యాన్స్‌కి ఎన్టీఆర్ ఫిజిక‌ల్ ట్రైన‌ర్ లాయిడ్ స్టీవెన్ స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్‌ని పిక్చ‌ర్‌ని సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా రిలీజ్ చేయ‌డంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయింది. ఇదిలా వుంటే ఇదే రోజు ఎన్టీఆర్, కేజీఎఫ్ ఫేమ్ ప్ర‌శాంత్ నీల్‌ల క‌ల‌యిక‌లో చేయ‌నున్న సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌తో పాటు త్రివిక్ర‌మ్‌తో ప్లాన్ చేసిన 30వ సినిమా తాజా న్యూస్ కూడా బ‌య‌టికి రానుంద‌ని తెలిసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All