
కొన్ని ప్రయాణాలు ఊహించని విధింగా ముగుస్తుంటాయి. ఈ సందర్భంగా మిత్రుడు అశ్విన్ గంగరాజుకు, `ఆకాశవాణి` టీమ్‌కు అభినందనలు` అని కార్తికేయ ట్వీట్ చేసి తను ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడించాడు. `బాహుబలి` చిత్రానికి సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా కార్తికేయ వర్క్ చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో రూపొందుతున్న `ఆకాశవాణి` చిత్రానికి సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
అయితే అనూహ్యంగా ఈ చిత్ర టీమ్ నుంచి తప్పుకోవడం ఆసక్తికరంగా మారింది. గత కొన్ని రోజులుగా అశ్విన్ గంగరాజు, కార్తికేయ మధ్య సఖ్యత కుదరడం లేదని, ఆ కారణంగానే ఇద్దరూ విడిపోయావలనుకుంటున్నారని ప్రచారం జరుగుతూనే వుంది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ శనివారం స్వయంగా కార్తికేయ తన పీఆర్ టీమ్‌తో మీడియాకు ఓ ప్రకటనని రిలీజ్ చేయించారు.
సినిమా నుంచి తాను తప్పుకుంటున్నానని. తనకు మరిన్ని బాధ్యతలు వున్నందున ఈ చిత్ర టీమ్ నుంచి తాను తప్పుకుంటున్నట్టు స్పష్టం చేశారు. దీనిపై దర్శకుడు అశ్విన్ గంగరాజు కూడా మీడియా ముఖంగా ప్రకటన చేశాడు. ఇద్దరి దారులు వేరైనందున ఇద్దరం విడిపోవాలనుకుంటున్నాం అని వెలంలడించాడు. రాజమౌళి ప్రస్తుతం `ఆర్ ఆర్ ఆర్` చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి వర్క్ చేయడం కోసమే కార్తికేయ `ఆకాశవాణి` చిత్రం నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది.