Homeటాప్ స్టోరీస్మాస్ కా దాస్.. ఎన్టీఆర్‌ బ‌ర్త్‌డే గిఫ్ట్!

మాస్ కా దాస్.. ఎన్టీఆర్‌ బ‌ర్త్‌డే గిఫ్ట్!

మాస్ కా దాస్.. ఎన్టీఆర్‌ బ‌ర్త్‌డే గిఫ్ట్!
మాస్ కా దాస్.. ఎన్టీఆర్‌ బ‌ర్త్‌డే గిఫ్ట్!

విశ్వ‌క్‌సేన్‌.. ఓ టిపికల్ హీరో. వెళ్లిపోమాకే చిత్రంతో కెరీర్ ప్రారంభించిన విశ్వ‌క్‌సేన్ ఇటీవ‌ల `అనంగ‌న‌మ‌లై డైరీస్‌` ఆధారంగా స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించి రూపొందించిన `ఫ‌ల‌క్‌నుమాదాస్‌`తో టాక్ ఆఫ్ ద ఇండ‌స్ట్రీగా నిలిచారు. మాస్‌కా దాస్‌గా ఆక‌ట్టుకున్న విశ్వ‌క్‌సేన్ వ‌రుస హిట్‌ల‌ని సొంతం చేసుకుంటున్నారు. తాజాగా ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్ `హిట్‌` సినిమాతో మ‌రో హిట్‌ని త‌న ఖాతాలో వేసుకున్న విశ్వ‌క్ ప్ర‌స్తుతం `పాగ‌ల్‌` చిత్రంలో న‌టిస్తున్నారు.

బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా న‌రేష్ కుప్పిలి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇదిలా వుంటే యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌కు విశ్వ‌క్‌సేన్ జ‌బ‌ర్ద‌స్త్ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ని అందించ‌బోతున్నారు. ఎన్టీఆర్ అంటే అమితంగా అభిమానించే విశ్వ‌క్ ఆయ‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా ఫ‌ల‌క్‌నుమాదాస్ చిత్రంలోని ర్యాప్ సాంగ్‌ని ఎన్టీఆర్‌కి అంకితం ఇవ్వ‌బోతున్నారు.

- Advertisement -

దీని కోసం రిలీజ్ చేసిన పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది. ఎన్టీఆర్‌ని మాస్ కా బాప్‌గా అభివ‌ర్ణిస్తూ ఈ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేశారు. ఈ నెల 20న యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుక‌లు జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని మే 20 బుధ‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు ఈ ర్యాప్ సాంగ్‌ను విశ్వ‌క్‌సేన్ సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ ర్యాప్ సాంగ్‌పై ఎలా స్పందిస్తారో చూడాలి. `పాగ‌ల్‌` చిత్రం కోసం ఇటీవ‌ల విశ్వ‌క్‌సేన్ ఓ పాట పాడిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే ఈ పాట‌ని రికార్డ్ కూడా చేశారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All