Homeటాప్ స్టోరీస్ఫ్యాన్స్‌కు యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ విన్న‌పం!

ఫ్యాన్స్‌కు యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ విన్న‌పం!

ఫ్యాన్స్‌కు యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ విన్న‌పం!
ఫ్యాన్స్‌కు యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ విన్న‌పం!

ఎన్టీఆర్ పుట్టిన రోజు ఈ నెల 20న జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా `ఆర్ఆర్ఆర్‌` నుంచి స‌ర్ఫ్రైజింగ్ గిప్ట్ వ‌స్తుంద‌ని కొండంత ఆశ‌తో వేయి క‌ళ్ల‌తో అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయ‌తే లాక్‌డౌన్ కార‌ణంగా అది సాధ్యం కావ‌డం లేద‌ని, `ఆర్ ఆర్ ఆర్‌` నుంచి ఎన్టీఆర్ లుక్‌కు సంబంధించిన వీడియో ఏదీ రిలీజ్ చేయ‌డం లేద‌ని మేక‌ర్స్ తాజాగా ప్ర‌క‌టించ‌డంతో ఫ్యాన్స్ నిరాశ‌కు లోన‌వుతున్నారు. ఈ సంద‌ర్భంగా ఫ్యాన్స్‌నుద్దేశించి ఎన్టీఆర్ చేసిన విన్న‌పం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

`ప్రియ‌మైన అభిమాన సోద‌రుల‌కు విన్న‌పం

- Advertisement -

ఈ విప‌త్తు స‌మ‌యంలో మీరు మీ కుటుంబ స‌భ్యులు క్షేమంగా వున్నార‌ని భావిస్తున్నాను. అంద‌రం క‌లిసి పోరాడితే ఈ స‌మ‌స్య నుండి సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ‌తాం అని న‌మ్ముతున్నాను.

ప్ర‌తీ ఏటా నా పుట్టిన రోజున మీరు చూపించే ప్రేమ‌, చేసే సేవా కార్య‌క్ర‌మాలు ఒక ఆశీర్వ‌చ‌నంగా భావిస్తాను. ఈ ఏడాది మాత్రం మీరు ఇంటిప‌ట్టునే వుంటూ, అధికారులు సూచన‌ల‌ను పాటిస్తూ భౌతిక దూరానికి క‌ట్టుబ‌డి వుండాల‌ని నా విన్న‌పం. ఇదే మీరు నాకు ఇచ్చే అతి విలువైన బహుమ‌తి.

అలాగే `ఆర్ఆర్ఆర్‌`చిత్రం నుండి ఈ సంద‌ర్భంగా ఎటువంటి ఫ‌స్ట్ లుక్ లేదా టీజ‌ర్ విడుద‌ల కావ‌డం లేదు అనే విష‌యం మిమ్మ‌ల్ని తీవ్ర నిరాశ‌కు గురిచేసింద‌ని నేను అర్థం చేసుకోగ‌ల‌ను. ఫ‌స్ట్ లుక్ లేదా టీజ‌ర్ మీ ఆనందం కోసం సిద్ధం చేయాల‌ని చిత్ర ఎంత‌గా క‌ష్ట‌ప‌డింది అనేది నాకు తెలుసు. కానీ ఒక ప్ర‌చార చిత్ర మీ ముందు ఉండాలి అంటే అన్ని సాంకేతిక విభాగాలు క‌లిసి శ్ర‌మించాలి. అధికారిక ఆంక్ష‌ల వ‌ల‌న అది కుద‌ర‌లేదు.

రాజ‌మౌళిగారి ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతోన్న ఈ చిత్రం ఒక సంచ‌ల‌నం సృష్టిస్తుంది అన్న న‌మ్మ‌కం నాకు వుంది. ఈ చిత్రం మిమ్మ‌ల్ని త‌ప్ప‌క అల‌రిస్తుంది. నా విన్న‌పాన్ని మ‌న్నిస్తార‌ని ఆశిస్తూ

మీ

ఎన్టీఆర్

అని ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి బ‌హిరంగ లేఖ రాశారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All