Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి `ఆర్ఆర్ఆర్‌` టీమ్ షాక్‌!

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి `ఆర్ఆర్ఆర్‌` టీమ్ షాక్‌!

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి `ఆర్ఆర్ఆర్‌` టీమ్ షాక్‌!
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి `ఆర్ఆర్ఆర్‌` టీమ్ షాక్‌!

ఎన్ఠీఆర్ పుట్టిన రోజు ఈ నెల 20న జ‌ర‌గ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఈ రోజున `ఆర్ ఆర్ ఆర్‌` టీజ‌ర్ రూపంలో ఫ్యాన్స్‌కి గిఫ్ట్ ఇవ్వ‌బోతున్నారంటూ ప్ర‌చారం జ‌రిగింది. ఈ ప్ర‌చారాన్ని నిజం చేస్తూ నిర్మాత దిన‌య్య కూడా ఎన్టీఆర్ గిఫ్ట్ రెడీ అవుతోందంటూ వెల్ల‌డించారు. దీంతో ఫ్యాన్స్ అంబ‌రాన్నంటే సంబ‌రాల‌కు పిద్ధ‌మ‌వుతున్న వేళ `ఆర్ఆర్ఆర్` టీమ్ నుంచి షాక్ లాంటి వార్త బ‌య‌టికొచ్చింది.

`లాక్‌డౌన్ స‌మ‌యాన్ని మ‌ళ్లీ పొడిగించ‌డంతో అనుకున్న ప‌ని ఆపేయాల్సి వ‌చ్చింది. మా వంతు ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ అనుకున్న ప‌నిని మాత్రం పూర్తి చేయ‌లేక‌పోయాం. ఎన్టీఆర్ బ‌ర్త్‌డే ట్రీట్‌ని సిద్ధం చేయ‌లేక‌పోయాం. ఈ కార‌ణంగాను ఫ‌స్ట్ లుక్ వీడియోని రిలీజ్ చేయ‌లేక‌పోతున్నాం` అని ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించ‌డంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ షాక్‌కు గుర‌య్యారు.

- Advertisement -

ఏదో ఒక‌టి రిలీజ్ చేయాల‌నుకోవ‌డం లేదు. మీ ఎదురుచూపుల‌కు త‌గ్గట్టుగానే త్వ‌ర‌లోనే విడుద‌ల చేస్తాం. అది మ‌న‌కు ఓ పెద్ద పండ‌గ అవుతుంద‌ని ఈ సంద‌ర్భంగా ప్రామిస్ చేస్తున్నాం` అని వెల్ల‌డించారు. గ‌త కొన్ని రోజులుగా ఎన్టీఆర్ టీజ‌ర్‌కు కావాల్సిన ఫుటేజ్ లేదంటూ రాజ‌మౌళి వెల్ల‌డిస్తూ వ‌స్తున్నారు. తాజా ప్ర‌క‌ట‌నతో రాజ‌మౌళి ఎందుకు అలా చెప్పారో క్లారిటీ వ‌చ్చింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All