Homeటాప్ స్టోరీస్రాక్‌స్టార్ ఫ్యాన్స్‌కి జ‌న‌వ‌రి 8న బిగ్‌ ట్రీట్!‌

రాక్‌స్టార్ ఫ్యాన్స్‌కి జ‌న‌వ‌రి 8న బిగ్‌ ట్రీట్!‌

రాక్‌స్టార్ ఫ్యాన్స్‌కి జ‌న‌వ‌రి 8న బిగ్‌ ట్రీట్!‌
రాక్‌స్టార్ ఫ్యాన్స్‌కి జ‌న‌వ‌రి 8న బిగ్‌ ట్రీట్!‌

క‌న్న‌డ రాక్ స్టార్ య‌ష్ హీరోగా న‌టించిన యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `కేజీఎఫ్ చాప్ట‌ర్ 1`. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో హొంబ‌లే ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై స్టార్ ప్రొడ్యూస‌ర్ విజ‌య్ కిర‌గందూర్ ఈ పాన్ ఇండియా స్థాయి చిత్రాన్ని నిర్మించారు. క‌న్న‌డ‌లో రూపొందిన ఈ చిత్రం తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించి రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన విష‌యం తెలిసిందే.

ప్ర‌స్తుతం ఈ మూవీకి సీక్వెల్ గా `కేజీఎఫ్ చాప్ట‌ర్ 2` రూపొందుతోంది. ఇటీవ‌లే ఈ మూవీ క్లైమాక్స్ కు సంబంధించిన స‌న్నివేశాల్ని సంజ‌య్‌ద‌త్‌, హీరో య‌ష్ పాల్గొన‌గా చిత్రీక‌రించారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో య‌ష్ ఫ్యాన్స్‌కి చిత్ర బృందం బిగ్ ట్రీట్ ఇవ్వ‌బోతోంది.

- Advertisement -

జ‌న‌వ‌రి 8న హీరో రాక్‌స్టార్ య‌ష్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని ఈ చిత్ర టీజ‌ర్‌ని రిలీజ్ చేయ‌బోతున్నారు. ఇదే విష‌యాన్ని పోస్ట‌ర్ రిలీజ్ చేసి నెటిజ‌న్స్‌తో  పంచుకున్నారు ప్ర‌శాంత్ నీల్‌. కేజీఎఫ్ సామ్రాజ్యంలోకి ప్ర‌వేశించ‌నున్నాం. టీజ‌ర్‌ని మీ ముందుకు తీసుకురావ‌డానికి దాదాపు ఏడాది కాలం ప‌ట్టింది. మేము ఎంతో స‌మ‌ర్ధ‌వంతంగా, అంద‌రిని మెప్పించే విధంగా రానున్నాం. జ‌న‌వ‌రి 8న ఉద‌యం 10:18 నిమిషాల‌కు ఈ చిత్ర టీజ‌ర్‌ని విడుద‌ల చేయ‌నున్నాం` అని ట్వీట్ చేశారు. దేశ వ్యాప్తంగా ఆస‌క్తిని రేకెత్తిస్తున్న ఈ మూవీలో సంజ‌య్‌ద‌త్‌, ర‌వీనా టాండ‌న్‌, ప్ర‌కాష్‌రాజ్‌, రావు ర‌మేష్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All