Homeరివ్యూస్‘యాద్గిరి & సన్స్’ మూవీ రివ్యూ

‘యాద్గిరి & సన్స్’ మూవీ రివ్యూ

‘యాద్గిరి & సన్స్’ మూవీ రివ్యూ
‘యాద్గిరి & సన్స్’ మూవీ రివ్యూ

చిత్రం: ‘యాద్గిరి & సన్స్’
విడుద‌ల తేది: మే 5, 2023
న‌టీన‌టులు: అనిరుధ్, యశస్విని, రోహిత్, జీవా, రాజీవ్ కనకాల, మధుమణి, నాగరాజ్, మోతీలాల్ తదితరులు.
సంగీతం: విజయ్ కురాకుల
డీఓపీ: శ్రీను బొడ్డు,
ఎడిటింగ్: మార్తాండ్. కె. వెంకటేష్,
పీఆర్వో: బి. వీరబాబు
కో-డైరక్టర్: అమర్నాథ్ కొత్తూరు
నిర్మాత: చంద్రకళ పందిరి,
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: భిక్షపతి రాజు పందిరి

తెలుగు తెర‌పైకి మ‌రో విభిన్న క‌థాచిత్రం వ‌చ్చింది. శ్రీ వేంకటేశ్వర క్రియేటివ్ వర్క్స్ బ్యాన‌ర్‌పై అనిరుధ్, యశస్విని జంటగా బిక్షపతి రాజు పందిరి దర్శకత్వంలో.. చంద్రకళ పందిరి నిర్మించిన చిత్రం ‘యాద్గిరి & సన్స్’. రియల్ ఇన్సిడెంట్ బేస్డ్ స్టోరీగా తెర‌కెక్కిన ఈ సినిమా తాజాగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ రిపోర్టులో తెలుసుకుందాం.

- Advertisement -

క‌థ‌:
యాద్గిరి(జీవా)కి లక్ష్మణ్(నాగ‌రాజు) – వెంకట్(అనిరుధ్) అనే ఇద్ద‌రు కొడుకులు ఉంటారు. చిన్న కొడుకు వెంక‌ట్ జాబ్ చేస్తుంటాడు. పెద్దొడు ల‌క్ష్మ‌ణ్ త‌న‌ త‌మ్ముడి డ‌బ్బులు దొంగిలిస్తూ తాగుతుంటాడు. ఒక‌రోజు వెంక‌ట్ తన ప్రియురాలు స్వాతి(యశస్విని)కి గిఫ్టు కొనడానికి పొదుపు చేసిన డబ్బును ల‌క్ష్మ‌ణ్ దొంగిలించి తాగుతుంటాడు. వెంకట్ కోపంతో తన అన్న ల‌క్ష్మ‌ణ్‌పై గొడవ పడుతాడు. గొడవలో, అతని అన్న చ‌నిపోతాడు. వెంకట్ కటకటాల వెనక్కి వెళతాడు. బెయిల్ వచ్చిన తర్వాత వెంకట్ తన సోదరుడి బీమా గురించి తెలుసుకుని అవ‌క్క‌వుతాడు. ఇంత‌కీ ఆ బీమా ఏంటీ? దాని వెన‌క ఏం జ‌రుగుతుంది? ఎలాంటి ట్విస్టులు జ‌రుగుతాయ‌నేదే సినిమా క‌థ‌.

న‌టీన‌టుల ప్ర‌తిభ‌:
తండ్రి యాద్గిరి పాత్ర‌లో సీనియ‌ర్ న‌టుడు జీవా త‌న పాత్ర‌కు జీవం పోశాడు. అత‌ని చిన్న కొడుకు వెంకట్ పాత్ర‌లో లీడ్ రోల్ చేశాడు అనిరుధ్‌. సినిమా క‌థ మొత్తాన్ని త‌న మీద వేసుకున్నాడు. త‌న పాత్ర‌కు త‌గిన న్యాయం చేశాడు. అత‌నికి ల‌వ‌ర్‌గా న‌టించిన యశస్విని క్యూట్‌గా క‌నిపించింది. అడ్వ‌కేట్ పాత్ర‌లో న‌టించిన రాజీవ్ కనకాల సినిమాకు స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ అని చెప్పాలి. త‌న న‌ట‌న‌తో సినిమా క‌థ‌కు మ‌రింతా వ‌న్నె తెచ్చాడు. విలన్‌గా చేసిన రోహిత్ త‌న పాత్ర‌ను స‌మ‌ర్థ‌వంతంగా పోషించాడు. ఇక మిగ‌తా పాత్ర‌ల్లో న‌టించిన మురళీధర్ గౌడ్, మధుమణి, నాగరాజ్, మోతీలాల్ తదితరులు త‌మ త‌మ పాత్ర‌ల్లో న‌టించి మెప్పించారు.

సాంకేతిక నిపుణుల ప‌నితీరు:
త‌ను రాసుకున్న క‌థకు న్యాయం జ‌రిగేలా టెక్నిక‌ల్ టీంను స‌రిగ్గా వాడుకోవ‌డంలో డైరెక్ట‌ర్ భిక్షపతి రాజు పందిరి స‌క్సెస్ అయ్యార‌నే చెప్పాలి. ఈ క్ర‌మంలో విజయ్ కురాకుల అందించిన మ్యూజిక్ సినిమాకు మొద‌టి ప్ల‌స్ పాయింట్‌గా చెప్పుకోవ‌చ్చు. సినిమాలో పాటలు లేక‌పోయినా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో మ్యాజిక్ చేశాడు విజ‌య్. డీవోపీ అందించిన‌ శ్రీను బొడ్డు ప‌నిత‌నం కూడా సూప‌ర్. ఎడిటింగ్ వ‌ర్క్ చేసిన‌ మార్తాండ్. కె. వెంకటేష్ ప‌నితీరు ప‌ర్వాలేదు. కాస్త క‌త్తెర‌కు ప‌ని చెప్పాల్సి ఉండేద‌ని అనిపిస్తుంది.

విశ్లేష‌ణ‌:
రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమా క‌థ‌ను రాసుకున్నాడు డైరెక్ట‌ర్ భిక్షపతి రాజు. సినిమాల్లో ఇంత‌వ‌ర‌కు రాని స‌బ్జెక్టును తీసుకున్నారు. ”ఇలా కూడా జ‌రుగుతుంది జాగ్ర‌త్త..” అంటూ ఓ అల‌ర్ట్‌ను అందించే ఓ మెసెజ్ కూడా ఈ సినిమాలో ఉంది. అన్ని రకాల ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. థియేటర్‌కి వచ్చి సినిమా చూసి వెళ్లేటప్పుడు.. ఒక మంచి సినిమా చూశామనే ఫీలింగ్ ఖచ్చితంగా ఈ సినిమా అందిస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు.

రేటింగ్ 3.25 / 5

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All