Homeరివ్యూస్లింగొచ్చా సమీక్ష

లింగొచ్చా సమీక్ష

లింగొచ్చా సమీక్ష
లింగొచ్చా సమీక్ష

శివ (కార్తిక్ రత్నం) హైదరాబాద్ పాతబస్తీ లో నాయి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కుర్రాడు. కటింగ్ చేయటంలో బాగా పేరుగాంచిన శివ చిన్నప్పుడే తన స్నీహితులతో కలసి లింగొచ్చా(ఏడు పెంకులాట) ఆడుతుంటే నూర్జహ (సుప్యర్థ సింగ్) ని చూసి ప్రేమలో పడతాడు. చిన్నప్పటి సంది నూర్జహ ని ప్రేమిస్తూనే వుంటాడు. ఇంతలో నూర్జహ ని వాళ్ళ తల్లితండ్రులు దుబాయ్ కి పంపిస్తాడు. అంతే శివ ప్రతిరోజు నూర్జహ కొసం ఇంటికి పోతూ వస్తుంటాడు. చిన్నప్పుడు దుబాయ్ కి వెళ్ళిన నూర్జహ పెద్దయ్యాక మెడికల్ స్టూడెంట్ గా హైదరాబాద్ కి వచ్చింది. అంతే శివ తన స్నేహితులు సలహలు పాటించి నూర్జహ దగ్గర ఫూల్ అవుతూ వుంటాడు. ఒక రోజు నూర్జహ శివ మనసు తెలుసుకుని తన ప్రేమని చెప్తుంది. వీళ్ళిద్దరి ప్రేమ విషయం తెలుసుకున్న నూర్జహ తండ్రి వేరే పెళ్ళి సంబందం చూస్తాడు. ఆ విషయాన్ని శివ కి చెప్పి దుబాయ్ వెళ్ళిపోదామని చెప్తుంది నూర్జహ.. శివ నూర్జహ చెప్పింది అంగీకిరించి దుబాయ్ వెళ్దామని ముందుగా నూర్జహ ని పంపిస్తాడు. తరువాత శివ తన పెరెంట్స్ ని దొస్త్ గాళ్ళని వదిలి నూర్జహ కొసం దుబాయ్ వెళ్ళాడా.. లేదా.. సింగిల్ గా వెళ్ళిన నూర్జహ దుబాయ్ లో ఏం చేసింది. పాతబస్తీలో శివ, నూర్జహ లవ్ స్టోరి ఎంతవరకూ వచ్చింది.. వీళ్ళు కలుసుకున్నారా.. లేదా అనేది ఈ చిత్ర కథ

హైలెట్స్..
మెయిన్ లీడ్
హైదరాబాద్ నెటివిటి
మ్యూజిక్
క్లైమాక్స్

- Advertisement -

మైనస్ లు
లౌడ్ కామెడి
సెకండాఫ్ లో ల్యాగ్

టెక్నీకల్
దర్శకుడు ఆనంద్ బడా తీసుకున్న నేపథ్యం మొచ్చుకొవాలి, హైదరాబాద్ నేటివిటి స్టొరీస్ వచ్చి చాలా కాలమైంది. లవ్ స్టొరి ని చెప్పే విధానం లో దర్శకుడు పాసయ్యాడు. అలాగే నటీనటుల నుంచి నటన రాబట్టుకున్నాడు. మ్యూజిక్ బికాజ్ రాజ్ మంచి సంగీతాన్ని అందించాడు. ఎడిటింగ్ పర్వాలేదనిపించింది. కెమెరామెన్ చాలా బాగా చేసాడు.. హైదరాబాద్ పాతబస్తి లొ లొకేషన్స్ ని అందంగా చూపించాడు. ఆర్ట్ వర్క్ కూడా బాగుంది. డైలాగ్స్ హైలెట్ గా నిలుస్తాయి..మిగతా టెక్నిషియన్స్ అందరూ వారి వారి పరిదిలో బాగా చేసారు.

నటీనటులు..

కార్తిక్ రత్నం ధియోటర్ ఆర్టిస్ట్ కావడం వలన పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. అతని సింగిల్ హ్యాండ్ లో కథ ని తీసుకెళ్ళాడు. హీరోయిన్ సుప్యర్థ సింగి ముద్దుగా అందర్ని ఆకట్టుకుంది. నటన, ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా పలికించింది. తాగుబోతు రమేష్, ఉత్తేజ్ లు స్టోరి నేరేటర్స్ గా మెప్పించారు. మిగతా పాత్రలన్ని వాటి పరిధిలో మెప్పించే ప్రయత్నం చేశారు.

ఎనాలసీస్..
హైదరాబాది నవాబ్స్, అంగ్రేజ్ లాంటి చిత్రాలతో లోకల్ లో సంచలన విజయాలు సాధించిన చాలా సంవత్సరాలు తరువాత లొకల్ గా లింగోచ్చా వచ్చింది. హైదరాబాది లు చూడదగ్గ చిత్రం. ఇరాని ఛాయ్ ఇష్టపడే ప్రతిఓక్కరూ ఈ వీకెండ్ ఒక్క సారి లింగోచ్చా ధియేటర్ కి వెళ్ళచ్చు..

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All