Homeటాప్ స్టోరీస్ఆశక్తికరంగా సాగే సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్ "చక్ర వ్యూహ్యం" రివ్యూ

ఆశక్తికరంగా సాగే సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్ “చక్ర వ్యూహ్యం” రివ్యూ

Chakravyuham Movie Review and Rating
Chakravyuham Movie Review and Rating

బేబీ అన్వి సమర్పణలో సహస్ర క్రియేషన్స్ బ్యానర్‌పై విలక్షణ పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు అజయ్ ప్రధాన పాత్రలో చెట్కూరి మధుసూధన్ దర్శకత్వంలో తెరకెక్కిన మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌ చిత్రం “చక్రవ్యూహం’ -ది ట్రాప్ అనేది ఉపశీర్షిక. శ్రీమతి. సావిత్రి గారు నిర్మించిన ఈ చిత్రం జూన్ 2 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి

కథ

- Advertisement -

వివేక్ ( సంజయ్ ) ఊర్వశి పరదేశి ( సిరి )లు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట. పెళ్లి తరువాత ఎంతో అన్యోన్యంగా, ఎంతో హ్యాపీ గా సాగుతున్న వీరి జీవితంలో ఎవరూ ఊహించని విధంగా సిరి హత్య గావించబడుతుంది. ఆ తరువాత ఈమె హత్యతో సంబందించిన వారందరూ వరుసగా హత్యకు గురవుతుంటారు. ఇలా ఎన్నో ట్విస్ట్ ల మధ్య ఆసక్తికరమైన పరిస్థితుల్లో ఎవరు ఎవరిని ఎందుకు చంపారో అర్థం కాకుండా ఉంటుంది. సస్పెన్స్ ప్రధానంగా సాగే ఈ కథలో సంజయ్ స్నేహితుడు సుదేశ్ (శరత్) పాత్రేమిటి అతను ఎందుకు హత్య గావించబడ్డాడు. అలాగే సంజయ్ దగ్గర పని చేస్తున్న మేనేజర్ మరియు సంజయ్ ను ఇష్టపడ్డ ప్రగ్య నయన్ ( శిల్ప) పాత్రేమిటి ఈ హత్యలవెనుక ఉన్న అసలు మర్మాన్ని పోలీసులు ఎలా చేదించారనేదే తెలుసుకోవాలంటే “చక్ర వ్యూహ్యం” సినిమా చూడాల్సిందే…

నటీ నటుల పనితీరు
సంజయ్ పాత్రలో నటించిన వివేక్ ఇటు భర్త గా, సైకో గా తన హావ భావాలతో చాలా చక్కటి నటనను ప్రదర్శించాడు.సిరి పాత్రలో సంజయ్ భార్య గా నటించిన ఊర్వశి పరదేశి తన పాత్రలో ఒదిగిపోయింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ పాత్రలో సత్య గా నటించిన అజయ్ నటన ఈ చిత్రానికే హైలెట్ అని చెప్పవచ్చు, తనకు సపోర్ట్ గా పోలీస్ పాత్రలో నటించిన దుర్గ (జ్ఞానేశ్వరి) కూడా చాలా చక్కగా నటించింది.హీరో ఫ్రెండ్స్ గా నటించిన రాజ్ తిరందసు ( రవి ), కిరీటి
ఇంకా ఇందులో హీరోయిన్ కు తల్లి గా నటించిన ప్రియ, తండ్రులుగా నటించిన రాజీవ్ కనకాల ( శ్రీధర్ ), శ్రీకాంత్ అయ్యాంగార్ ( శ్రీనివాస్ ), హీరోయిన్ తాతగా నటించిన శుభలేఖ సుధాకర్ ( జగన్నాధం ) పాత్రలు చిన్నవే అయినా ఉన్నంతలో ఆయా పాత్రలకు జీవం పోశారు.

సాంకేతిక నిపుణుల పనితీరు

డైరెక్టర్ మధుసూధన్ కిది తొలి సినిమా అయినప్పటికీ ఆద్యంతం ప్రేక్షకులు సస్పెన్స్ కు గురయ్యేలా చక్కటి కథ, స్క్రీన్ ప్లే, తో తీసిన తీరు ప్రేక్షకులకు ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. అనుక్షణం ప్రతి ఫ్రెమ్ లోను ఆ సస్పెన్స్ ను అలాగే కొనసాగించి దర్శకుడిగామంచి ప్రతిభను కనపరచాడు. కథకు తగ్గ నటీనటులను ఎంపిక చేసుకోవడంలో కూడా సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.
జివి అజయ్ కెమెరా పనితనం మెచ్చుకోవచ్చు. సస్పెన్స్ తో సాగే ప్రతి సన్నివేశాన్ని తన కెమెరాలో చక్కగా బందించి తన కెమెరా పనితనాన్ని చాటారు. జెస్విన్ ప్రభు ఎడిటింగ్ పనితీరు బాగుంది.భరత్ మంచిరాజు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. బేబీ అన్వి సమర్పణలో సహస్ర క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీమతి. సావిత్రి గారు నిర్మించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయి కి తగ్గట్టు ఉండి సినిమాపై వారికున్న టేస్ట్ ను తెలిపింది. మొత్తంగా చూస్తే సస్పెన్స్ తో సాగే ఉత్కంఠ భరితమైన కథనాన్ని ప్రేక్షకులు మెచ్చేలా తీర్చి ద్దిన వైనం కనిపిస్తోంది. కాబట్టి చూసిన ప్రేక్షకులందరికీయి సినిమా కచ్చితంగా నచ్చుతుంది

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All