Homeటాప్ స్టోరీస్విశ్వవిజేత ఇంగ్లాండ్

విశ్వవిజేత ఇంగ్లాండ్

England Cricket Team
England Cricket Team

క్రికెట్ కు పుట్టినిల్లు అయిన ఇంగ్లాండ్ ఎట్టకేలకు విశ్వవిజేత గా నిలిచింది . వరల్డ్ కప్ ని తొలిసారిగా సొంతం చేసుకొని తమ చిరకాల వాంఛ ని తీర్చింది . ఇక వరల్డ్ కప్ విశ్వవిజేతగా నిలవడం అసాధ్యమే అనుకున్న సమయంలో అనితర సాధ్యమైన విజయాన్ని సాధించి ఇంగ్లాండ్ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించారు . 44 ఏళ్లుగా వరల్డ్ కప్ కోసం ఎదురు చూస్తున్న ఇంగ్లాండ్ కు ఆ శుభఘడియలు రానే వచ్చాయి .

న్యూజిలాండ్ తో ఫైనల్ పోరు రసవత్తరంగా సాగగా ఫైనల్ మ్యాచ్ టై కావడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది . న్యూజిలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేయగా ఇంగ్లాండ్ కూడా 50 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ అయ్యింది . దాంతో టై కావడంతో సూపర్ ఓవర్ ఆడించారు . మరీ గమ్మత్తైన విషయం ఏంటంటే సూపర్ ఓవర్ లో కూడా మళ్ళీ టై కావడం. సూపర్ ఓవర్ లో న్యూజిలాండ్ 15 పరుగులు చేయగా ఇంగ్లాండ్ కూడా 15 పరుగులు చేసింది . అయితే ఇంగ్లాండ్ జట్టు 2 ఫోర్లు కొట్టడంతో విశ్వవిజేత గా ఇంగ్లాండ్ ని ప్రకటించారు . దాంతో ఆ దేశం అంతటా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం ప్రభావం కోల్పోతుందని భావిస్తున్న ఈ తరుణంలో ప్రపంచ కప్ విజేతగా నిలవడంతో ఆ దేశ చిరకాల వాంఛ ఎట్టకేలకు నెరవేరింది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All