Homeటాప్ స్టోరీస్పవన్ తో పనిచేయడం గౌరవమన్న రానా దగ్గుబాటి

పవన్ తో పనిచేయడం గౌరవమన్న రానా దగ్గుబాటి

పవన్ తో పనిచేయడం గౌరవమన్న రానా దగ్గుబాటి
పవన్ తో పనిచేయడం గౌరవమన్న రానా దగ్గుబాటి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తోన్న విషయం తెల్సిందే. మలయాళ సూపర్ హిట్ రీమేక్ అయ్యప్పనుమ్ కోశియుమ్ చిత్రంలో నటిస్తున్నారు. సాగర్ కె చంద్ర ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నాడు. రీసెంట్ గా ఈ చిత్ర షూటింగ్ తిరిగి మొదలైంది. ఈ సందర్భంగా చిన్న మేకింగ్ వీడియోను విడుదల చేసారు.

దీంట్లో పవన్ కళ్యాణ్, రానా ఇద్దరి లుక్స్ అదిరిపోయాయనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ పాత్రను పోషిస్తున్నాడు. ఈ మేకింగ్ వీడియోకు రెస్పాన్స్ అదిరింది. ఇక రానా పవన్ కళ్యాణ్ తో పనిచేయడం గురించి స్పందించాడు. పవన్ తో పనిచేయడం తనకు గౌరవమని రానా అన్నాడు. అంత అనుభవమున్న నటుడితో పనిచేయడాన్ని ఆస్వాదిస్తున్నట్లు తెలిపాడు.

- Advertisement -

నిత్యా మీనన్, ఐశ్వర్య రాజేష్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా విడుదలవుతుందని అధికారికంగా ప్రకటించారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All