
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరిగి సెట్స్ కు వచ్చేసాడు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా కొంత బ్రేక్ పడిన విషయం తెల్సిందే. పవన్ కళ్యాణ్ కు కూడా కరోనా సోకిన విషయం తెల్సిందే. ఇక ఇప్పుడు కేసులు తగ్గుముఖం పట్టి, పవన్ కు కూడా పూర్తిగా నయమవ్వడంతో షూటింగ్స్ కు వస్తున్నాడు. ముందుగా మలయాళ రీమేక్ చిత్రం అయ్యప్పనుమ్ కోశియుమ్ చిత్ర షూటింగ్ ను తిరిగి మొదలుపెట్టాడు.
రానా దగ్గుబాటి కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నాడు. రానా మరో లీడ్ రోల్ ను చేస్తోన్న విషయం తెల్సిందే. తాజాగా ఈ చిత్ర మేకింగ్ వీడియోను విడుదల చేసారు. పవన్ కళ్యాణ్ లుక్ ను కూడా ఈ సందర్భంగా విడుదల చేసారు. అటు రానా, ఇటు పవన్ కళ్యాణ్ కూడా తమ లుక్స్ లో అదిరిపోయారు.
ఇక పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ పాత్రలో కనిపిస్తాడని రివీల్ చేసారు. సాగర్ కె చంద్ర ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా త్రివిక్రమ్ స్క్రీన్ ప్లేతో పాటు డైలాగ్స్ కూడా అందిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న విషయం తెల్సిందే.
PowerStar as #BheemlaNayak, will take charge Sankranthi 2022 ????
Here’s a small glimpse from the sets of @sitharaentsm #ProductionNo12
PowerStar @PawanKalyan @RanaDaggubati #Trivikram @MusicThaman @saagar_chandrak @dop007 @vamsi84 @NavinNooli @venupro pic.twitter.com/M6G9b3tY9m
— BARaju’s Team (@baraju_SuperHit) July 27, 2021