
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సినిమాల్లో రికార్డుల మీద రికార్డులు తిరగరాసిన వ్యక్తి. ప్రస్తుతం సినిమాలకు స్వస్తి పలికి రాజకీయాల్లో తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నాడు. జనసేన సార్వత్రిక ఎన్నికల్లో దారుణ ఓటమి అనంతరం పార్టీని పునర్నిర్మించే పనిలో ఉన్నాడు పవన్ కళ్యాణ్. అయితే మరోవైపు పవర్ స్టార్ ను మళ్ళీ సినిమాల్లోకి తీసుకురావడానికి విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ దగ్గర ఏఎం రత్నం ఇచ్చిన అడ్వాన్స్ అలాగే ఉంది.
అందుకే ఇప్పుడు రత్నం.. పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నాడు. అందుకోసం క్రిష్ జాగర్లమూడి దగ్గర ఉన్న కథను పవన్ కు వినిపించే ప్రయత్నాల్లో ఉన్నాడు. తన రాజకీయ ప్రయాణానికి ఉపయోగపడేలా సామాజిక బాధ్యతతో కూడిన ఒక కథను క్రిష్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
కనీసం ఈ సామాజిక కోణం అన్నది చూసైనా పవన్ ఎస్ అంటాడని రత్నం ఆశాభావంతో ఉన్నాడు. మరి సినిమాలంటే తనకు ఎప్పుడూ పెద్ద ఆసక్తి లేదని చెప్పే పవన్, రాజకీయాల్లో తలమునకలై ఉన్న నేపథ్యంలో ఎస్ చెబుతాడా లేదా అన్నది వేచి చూడాలి.